ఇయర్ ఎండ్ స్పెషల్ : టాప్ హీరోస్ 2018

Sunday,December 23,2018 - 10:10 by Z_CLU

ప్రతి ఇయర్ టాప్ లో ఉంటారు కొందరు హీరోలు. ఈ ఏడాది కూడా అలా తమ టాప్ ప్లేస్ ను నిలబెట్టుకున్నారు కొందరు హీరోలు. టాలీవుడ్ హీరోల్లో కొందరు ప్రేక్షకుల అంచనాలు అందుకుంటే, మరికొందరు ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టు రాణించలేకపోయారు. ఇంకొందరు పూర్తిగా చతికిలపడ్డారు. 2018లో క్లిక్ అయిన ఆ టాప్ హీరోస్ ఎవరోచూద్దాం…

రామ్ చరణ్.. 2018 టాప్ హీరోస్ లో ఒకడు. రంగస్థలం సినిమాతో ఈ హీరో దూసుకొచ్చాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిట్టిబాబుగా ఒదిగిపోయాడు చెర్రీ. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో’రంగస్థలం’ కూడా ఒకటి. సమ్మర్ ఎట్రాక్షన్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ముదులిపింది.

ఈ ఏడాది టాప్ హీరోల లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ కూడా ఉన్నాడు. భరత్ అనే నేను సినిమాతో మెరిశాడు ఈ హీరో. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో స్టయిలిష్ సీఎంగా మెప్పించి, బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టాడు.

ప్రతి ఏడాది టాప్ హీరోల లిస్ట్ లో ఎవరూ మిస్ అయినా అవ్వకున్నా ఎన్టీఆర్ మాత్రం మిస్ అవ్వడు. ఏడాదికో సూపర్ హిట్ తో దూసుకుపోతున్న యంగ్ టైగర్, ఈ ఏడాది కూడా అరవింద సమేత చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాడు. వీరరాఘవ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ యాక్టింగ్ కు టాలీవుడ్ ఫిదా అయింది.

2018లో సిల్వర్ స్క్రీన్ పైకి తారాజువ్వలా దూసుకొచ్చిన హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ యంగ్ స్టర్.. ఈ ఏడాది గీతగోవిందం సినిమాతో మరో కళ్లుచెదిరే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అదే ఊపులో టాక్సీవాలాతో మరో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. అలా ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన హీరోగా నిలిచాడు విజయ్ దేవరకొండ.

విజయ్ దేవరకొండ సరసన వరుణ్ తేజ్ కూడా నిలుస్తాడు. ఈ మెగాహీరో కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు.ఇయర్ ఫస్టాఫ్ లో తొలిప్రేమ సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ హీరో, ఎండింగ్ లో అంతరిక్షంతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్ లా సుధీర్ బాబు కూడా ఈ ఏడాది రెండు హిట్స్ కొట్టాడు. సమ్మోహనంతో హిట్ కొట్టిన ఈ క్యూట్ హీరో, ఇదే ఇయర్ లో నన్ను దోచుకుందువటే సినిమాతో మరో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఒకే ఏడాది ఇలా రెండు హిట్స్ కొట్టడం సుధీర్ బాబు కెరీర్ లో ఇదే ఫస్ట్ టైం.

ఈ ఏడాది బోణీకొట్టిన హీరోల జాబితాలో నాగశౌర్య కూడా ఉన్నాడు. అతడు నటించిన ఛలో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంకా చెప్పాలంటే ఈ 2018లో తొలి సూపర్ హిట్ సినిమా ఇదే. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిలేరియస్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అయితే ఇదే ఊపును మళ్లీ కొనసాగించలేకపోయాడు నాగశౌర్య.

ఈ ఇయర్ టాప్ హీరోల్లో నాగచైతన్య కూడా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో చైతూ చేసిన శైలజారెడ్డి అల్లుడు సినిమా ఫెస్టివల్ మూవీ అనిపించుకుంది. ఈ సినిమాతో నాగచైతన్య తన మర్కెట్ ను ఇంకాస్త పెంచుకున్నాడు. ఇదే ఊపులో చైతూ చేసిన సవ్యసాచి మాత్రం అతడి కెరీర్ కు అంత ప్లస్ అవ్వలేదు.

రెగ్యులర్ గా హిట్స్ కొట్టే బన్నీ కూడా ఈ ఏడాది ‘నా పేరు సూర్య’ సినిమా చేశాడు. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ అల్లు అర్జున్ చేసిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనర్స్ లో ఒకటిగా నిలిచింది బన్నీ మూవీ.

ఈ హీరోలంతా ఎప్పుడూ హిట్స్ కొట్టేవాళ్లే. కానీ ఊహించని విధంగా ఓ హీరో ఈ లిస్ట్ లోకి చేరాడు. అతడే కార్తికేయ. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి టాప్ హీరో అనిపించుకున్నాడు ఈ కుర్రహీరో. ఆ సినిమానే ఆర్ఎక్స్100. ఈ సినిమా సక్సెస్ తో 2019ను గ్రాండ్ గా స్టార్ట్ చేయబోతున్నాడు కార్తికేయ.

అడవి శేషు కూడా ఈ ఏడాది టాప్ హీరోల లిస్ట్ లోకి చేరాడు. అన్నీ తానై ఇతడు తీసిన గూఢచారి సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. ఈ సినిమాకు రైటింగ్ లో కూడా పాలుపంచుకున్న అడవి శేషు.. సిల్వర్ స్క్రీన్ పై ఏజెంట్ గోపిగా కనిపించి మెప్పించాడు.

అక్కినేని హీరో సుశాంత్ కూడా హిట్ కొట్టాడు. చాన్నాళ్లుగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరో.. చిలసౌ సినిమాతో ఈ ఏడాడి బోణీకొట్టాడు. ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏంటంటే.. మరో హీరో రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.

నందమూరి నటసింహం బాలయ్య కూడా ఈ ఏడాది తన హవా చాటుకున్నారు. జై సింహా సినిమాతో సంక్రాంతి పందెంకోడిగా నిలిచిన బాలకృష్ణ, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించారు. ఈ సినిమాతో మరోసారి మాస్ సినిమాలకు కేరాఫ్ అనిపించుకున్నారు బాలయ్య.

హీరోలందరూ ఒకెత్తయితే, నాని-నాగార్జున మరో ఎత్తు. వీళ్లిద్దరూ జాయింట్ గా సూపర్ హిట్ కొట్టారు. అదే దేవదాస్ సినిమా. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై రిచ్ గా తెరకెక్కిన దేవదాస్ సినిమా సక్సెస్ క్రెడిట్ ను ఈ ఇద్దరు హీరోలకు కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. అలా నాని, నాగ్ కూడా ఈ ఏడాది టాప్ హీరోల లిస్ట్ లోకి చేరిపోయారు.

లాస్ట్ ఇయర్ మళ్లీ రావా సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన సుమంత్, ఈ ఏడాది కూడా తన సక్సెస్ ను కొనసాగించాడు. ఫస్ట్ టైం సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లోకి ఎంటరైన సుమంత్.. సుబ్రహ్మణ్యపురం సినిమాతో కెరీర్ లో మరో సక్సెస్ అందుకున్నాడు.