డిసెంబర్ 29 న నయనతార కొత్త సినిమా రిలీజ్

Saturday,December 22,2018 - 04:36 by Z_CLU

సక్సెస్ ఫుల్ గా వరస ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న నయనతార మరో సినిమాతో ఈ న్యూ ఇయర్ సందడి చేయనుంది. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘లేడీ టైగర్’ డిసెంబర్ 29 న రిలీజవుతుంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘ఎలెక్ట్రా’ సినిమాని తెలుగులో ‘లేడీ టైగర్’ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

మోస్ట్ ఇంటెన్సివ్ సైకలాజికల్ థ్రిల్లర్ లా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార కంప్లీట్ గా డిఫెరెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది. గ్రీక్ మైథలాజికల్ క్యారెక్టర్ ‘ఎలెక్ట్రా’ ని రిఫరెన్స్ గా తీసుకుని నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ డ్యూయల్ రోల్ లో నటించాడు. దానికి తోడు బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా ఈ సినిమాకి ప్రత్యేక  ఆకర్షణ.

శ్యామ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సురేష్ దూడల నిర్మాత. ఆల్ఫోన్స్ జోసెఫ్ మ్యూజిక్ కంపోజర్. ఈ సినిమా టాలీవుడ్ ఆడియెన్స్ కి ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుందో చూడాలి.