జీ సినిమాలు (21-11-16)

Sunday,November 20,2016 - 08:50 by Z_CLU

moratodu

నటీనటులు: సత్య నారాయణ, జయసుధ

ఇతర నటీనటులు : అల్లు రామలింగయ్య, రావు గోపాల రావు, ప్రభాకర రెడ్డి, మోహన్ బాబు, సాక్షి రంగారావు, శుభ, రాధాకుమారి, గిరిజ

మ్యూజిక్ డైరెక్టర్ : M.S.విశ్వనాథన్

డైరెక్టర్ : నాగేష్

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

తిన్నగా ఎదగాల్సిన మొక్కని అస్తమానం తుంచుతూ ఉంటే అది తిన్నగా ఎదగదు అలాగే ఒక మనిషిని పసితనం నుండే అణచి వేయడం మొదలు పెడితే అతను మొరటోడి లా తయారవుతాడు అనే కథాంశం తో తెరకెక్కిందే మొరటోడు సినిమా. సత్యనారాయణ మొరటోడిగా నటించిన ఈ సినిమాలో, అతను మొరటోడిలా మారడానికి కారణాలు, ఆ తరవాత తన జీవితంలో కలిగిన ప్రతి మార్పుని బుల్లితెరపై చూడాల్సిందే.

==========================================

kathanayakudu

 

నటీ నటులు : నందమూరి బాలకృష్ణ, విజయ శాంతి

ఇతర నటీనటులు : గొల్లపూడి మారుతి రావు, శారద, అల్లు రామలింగయ్య, చంద్ర మోహన్, నూతన్ ప్రసాద్

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : K. మురళి మోహన్ రావు

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 14 డిసెంబర్ 1984

మాస్ హీరో కన్నా ముందు నటరత్న బాలకృష్ణకి ఫ్యామిలీ ఫాలోయింగే ఎక్కువ. కథని పట్టి ఉంచే భావోద్వేగాలతో తెరకెక్కిందే కథానాయకుడు. ఈ సినిమాని రామానాయుడు గారు నిర్మించారు. చక్రవర్తి సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

=========================================================

 

chadasthapu-moguduy

నటీ నటులు : సుమన్, భానుప్రియ

ఇతర నటీనటులు : రాజేష్, శుభలేఖ సుధాకర్, Y. విజయ, శ్రీ లక్ష్మి, వర లక్ష్మి, K.V.లక్ష్మి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : శరత్

ప్రొడ్యూసర్ : మిద్దె రామారావు

రిలీజ్ డేట్ : 1986

సిల్వర్ స్క్రీన్ పై ఒకప్పుడు భానుప్రియ, సుమన్ జంటకి చాలా క్రేజ్ ఉండేది. వీరిద్దరూ భార్యా భర్తలుగా చాలా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందులో చాదస్తపు మొగుడు చాలా స్పెషల్. ఈ సినిమాలో సుమన్, భానుప్రియల నటన హైలెట్ గా నిలుస్తుంది.

============================================================

 

 

123fromamalapuram

నటీ నటులు : రవి ప్రకాష్, రాజా శ్రీధర్, అనిల్, నిత్యా దాస్

ఇతర నటీనటులు : ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణ భగవాన్, కొండవలస, మల్లాది రాఘవ, MVS హరనాథ రావు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : వెంకటేశ్వర

డైరెక్టర్ : వర్మ

ప్రొడ్యూసర్ : 9 మూవీ మేకర్స్

రిలీజ్ డేట్ : 19 ఆగస్టు 2005

అల్లరిచిల్లరగా తిరిగే ముగ్గురు యువకులు, టెన్నిస్ చాంపియన్ కావాలని కలలు కంటున్న ఒక అమ్మాయి కలను నిజం చేయడానికి ఏం చేశారు..? ఆ ప్రయత్నం వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది అన్నదే ఈ సినిమా కథాంశం.

==============================================================

 

sri-mahalakshmi

నటీ నటులు : శ్రీహరి, సుహాసిని  షామ్న

ఇతర నటీనటులు : సన, సాయాజీ షిండే, తిలకన్, ముమైత్ ఖాన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : విజయన్

ప్రొడ్యూసర్ : శాంతి శ్రీహరి

రిలీజ్ డేట్ : 4 మే 2007

రియల్ స్టార్ శ్రీహరి కరియర్ లోనే బెస్ట్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్. పవర్ ఫుల్ లాయర్ లక్ష్మీ కృష్ణ దేవరాయ క్యారెక్టర్ లో కనిపించిన శ్రీహరి నటన సినిమాకే హైలెట్. శ్రీహరికి అక్కగా సుహాసినీ మణిరత్నం సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఒక అమ్మాయిని హత్య చేసిన నేరంలో తొమ్మిది మంది అమ్మాయిలు అరెస్ట్ అవుతారు. ఆ  హత్య నిజానికి ఆ అమ్మాయిలే చేశారా..? లాయర్ లక్ష్మీ కృష్ణ దేవరాయ ఆ కేసును ఎలా చేధించాడు అన్నదే ప్రధాన కథాంశం.

===================================================

sainikudu

నటీ నటులు : మహేష్ బాబు, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఇర్ఫాన్ ఖాన్, కామ్న జెఠ్మలాని, కోట శ్రీనివాస రావు, రవి వర్మ అజయ్

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : గుణశేఖర్

ప్రొడ్యూసర్ :  అశ్విని దత్

రిలీజ్ డేట్ :  1 డిసెంబర్ 2006

మహేష్ బాబు కరియర్ లో సైనికుడు సినిమా ప్రత్యేకమైనది. రాజకీయ అవినీతి పరులపై ఒక యువకుడు చేసిన పోరాటమే సైనికుడు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు. త్రిష అమాయకత్వపు నటన సినిమాకే హైలెట్. హారిస్ జయరాజ్ ప్రతి పాట బావుంటుంది.