దీపావళి కానుకగా 2.0

Monday,November 21,2016 - 09:00 by Z_CLU

ఈ ప్రపంచం కేవలం మనుషులది మాత్రమే కాదు… 2.0 ట్యాగ్ లైన్ ఇది. ఈ ఒకే ఒక్క ట్యాగ్ లైన్ చాలు, సినిమా కథ ఏంటి, అది ఏ రేంజ్ లో ఉండబోతోందో ఊహించడానికి. అవును.. పూర్తిగా రోబోలతో శంకర్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ వండర్ 2.0. దాదాపు ఏడాదిగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ముంబయిలో విడుదలైంది. హీరోగా నటిస్తున్న సూపర్ స్టార్, విలన్ గా నటిస్తున్న అక్షయ్ కుమార్ గెటప్స్ విడుదల చేశారు. అలా ఫస్ట్ లుక్ తోనే అంచనాలను అందుకుంది 2.0 సినిమా.

rajini2

తన సినిమా నుంచి ప్రేక్షకులు ఏదైతే ఊహించారో…. ఫస్ట్ లుక్ తో అంతకుమించి థ్రిల్ అందించాడు దర్శకుడు శంకర్. ముంబయిలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో 2.0ఫస్ట్ లుక్ చూసి యావత్ భారతదేశం షాక్ అయింది. రజనీకాంత్, అక్షయ్ కుమార్ ల గెటప్పులు అదిరిపోయాయి. దీంతో సినిమాపై అంచనాలు మూడింతలు పెరిగిపోయాయి. ఎమీ జాక్షన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని కూడా ఫస్ట్ లుక్ రిలీజ్ రోజునే ప్రకటించారు. వచ్చే ఏడాది దీపావళి కానుకగా 2.0 సందడి చేయబోతోంది. భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా 2.0 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.