మహేష్ కొత్త సినిమా ఫస్ట్ లుక్

Sunday,November 20,2016 - 01:00 by Z_CLU

మహేష్-మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. షూటింగ్ దాదాపు 60శాతం కంప్లీట్ చేసినా, టైటిల్ మాత్రం ఎనౌన్స్ చేయలేదు. దసరా, దీపావళి సీజన్లు ముగిసినా ఫస్ట్ లుక్ రాలేదు. చివరికి కీలకమైన మహేష్ బాబు పుట్టినరోజు నాడు కూడా ఫస్ట్ లుక్ విడుదల చేయలేదు. ఇప్పుడు తాజాగా జనవరి  అంటున్నారు. అవును… ఫస్ట్ లుక్ టీజర్ ను జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారనే టాక్ నడుస్తోంది.

ఈసారైనా మహేష్ బాబు కొత్త సినిమా టీజర్ లేదా ఫస్ట్ లుక్ వస్తుందా అనేది అందరి డౌట్. అయితే ఈసారి పక్కాగా ఏదో ఒక హంగామా ఉంటుందనే టాక్ యూనిట్ నుంచి వస్తోంది. అయితే అది టీజరా.. లేక జస్ట్ ఫస్ట్ లుక్ పోస్టరా అనేది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది.