జీ సినిమాలు ( 1st జూలై )

Saturday,June 30,2018 - 11:58 by Z_CLU

అష్టా చెమ్మా

నటీనటులు : నాని, శ్రీనివాస్ అవసరాల, స్వాతి, భార్గవి

ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, హేమ, ఝాన్సీ, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రాగిణి

మ్యూజిక్ డైరెక్టర్ : కల్యాణి మాలిక్

డైరెక్టర్ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

ప్రొడ్యూసర్ : రామ్ మోహన్

రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 2008

నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి, భార్గవి నలుగురికి ఒకేసారిగా రేంజ్ స్టార్ డం ని తీసుకొచ్చి పెట్టిన సినిమాఅష్టా చెమ్మా’. సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్ళి చేసుకోవాలనుకునే లావణ్య చివరికి మహేష్ అనే పేరున్నా చాలు అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. తరవాత ఏం జరిగింది అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

పూజ

నటీనటులువిశాల్, శృతి హాసన్

ఇతర నటీనటులు : సత్య రాజ్, రాధికా శరత్ కుమార్, ముకేశ్ తివారి, సూరి, జయ ప్రకాష్,  తదిరులు

మ్యూజిక్ డైరెక్టర్యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : హరి

ప్రొడ్యూసర్ : విశాల్

రిలీజ్ డేట్ : 22 అక్టోబర్ 2014 

విశాల్, శృతి హాసన్ జంటగా మాస్ సినిమా దర్శకుడు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్పూజ’.  ప్రతీ సినిమాలో మాస్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసే విశాల్ అలాంటి మాస్ క్యారెక్టర్ లో నటించిన సినిమా లో యాక్షన్ సీన్స్, శృతి హాసన్ గ్లామర్, కామెడీ సీన్స్ , సాంగ్స్  హైలైట్స్. 

=============================================================================

రాక్షసుడు

నటీనటులు : సూర్య, నయనతార

ఇతర నటీనటులు : ప్రేమ్గీ అమరేన్, ప్రణీత సుభాష్, ప్రతిభాన్, రియాజ్ ఖాన్, సముథిరఖని, శరత్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : వెంకట్ ప్రభు

ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేల్ రాజా

రిలీజ్ డేట్ : 29  మే 2015

సూర్య కరియర్ లోనే డిఫెరెంట్ సినిమాగా నిలిచింది రాక్షసుడు. సూర్య డ్యూయల్ రోల్ లో నటించిన సినిమా అటు తమిళం లోను, తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయింది. ఆత్మగా నటించిన సూర్య పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. నయనతార సినిమాలో హీరోయిన్ గా నటించింది.

==============================================================================

ఏక్ నిరంజన్ 

నటీనటులు : ప్రభాస్, కంగనా రనౌత్

ఇతర నటీనటులు : సోను సూద్, ముకుల్ దేవ్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, వేణు మాధవ్, మర్కాండ్ దేశ్ పాండే తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : ఆదిత్య రామ్ మూవీస్

రిలీజ్ డేట్ : 30 అక్టోబర్ 2009

ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ ఎంటర్ టైనర్ ఏక్ నిరంజన్. చోటు గా ప్రభాస్ ఆక్టింగ్ సినిమాకే హైలెట్. వైపు పోలీసులకు హెల్ప్ చేస్తూ మరోవైపు తన తలిదండ్రులను వెదుక్కుంటూ ఉంటాడు. ప్రభాస్, కంగనా రనౌత్ మధ్య సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించాడు పూరి జగన్నాథ్.

==============================================================================

ధీరుడు

నటీనటులు : విశాల్, ఐశ్వర్య అర్జున్

ఇతర నటీనటులు : సంతానం, జగన్, జాన్ విజయ్, ఆదిత్య ఓం, మురళి శర్మ, సీత తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : తమన్

డైరెక్టర్ : భూపతి పాండ్యన్

ప్రొడ్యూసర్ : మైకేల్ రాయప్పన్

రిలీజ్ డేట్ : 26 జూలై 2013

సినిమా సినిమాకి వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడతాడు విశాల్. సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించిన తొలి తమిళ చిత్రంపట్టాతు యానై” సినిమాకి డబ్బింగ్ వర్షన్ ధీరుడు. సినిమా రెండు భాషలలోను ఒకేసారి రిలీజయింది. సంతానం కామెడీ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

==============================================================================

పోలీస్ స్టోరీ-2

హీరోసాయికుమార్

ఇతర నటీనటులు – రాక్ లైన్ వెంకటేశ్, పీజే శర్మ, సన, శోభరాజ్, పొన్నాంబలం

సంగీతంఆర్పీ పట్నాయక్

స్క్రీన్ ప్లే, దర్శకత్వంథ్రిల్లర్ ముంజు

విడుదల తేదీ – 1996

అప్పటికే సౌత్ లో పెద్ద హిట్ అయిన పోలీస్ స్టోరీకి సీక్వెల్ గా పోలీస్ స్టోరీ-2ను తెరకెక్కించారు. పోలీస్ స్టోరీ సినిమాకు పనిచేసిన టీం అంతా దాదాపుగా సీక్వెల్ కు కూడా పనిచేశారు. ఇప్పటికీ సాయికుమార్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే అగ్ని పాత్ర సినిమాలోనిదే. యాక్షన్ సినిమాలు, అదిరిపోయే మాస్ డైలాగులు కోరుకునే ప్రేక్షకులకు సినిమా ఫుల్ మీల్స్ లాంటిది.