రానాతో మూడో సినిమా ?

Saturday,June 30,2018 - 06:11 by Z_CLU

‘నేనే రాజు నేను మంత్రి’ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు రానా.. ప్రస్తుతం ‘హాతీ మేరే సాతి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు దగ్గుబాటి హీరో. అందులో  ఒకటి ‘కోడి రామమూర్తి’ బయోపిక్ కాగా మరొకటి గుణ శేఖర్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో  తెరకెక్కనున్న ‘హిరణ్య’… ఈ సినిమాలతో పాటే తరుణ్ భాస్కర్ మూడో సినిమా కూడా రానాతో ఉంటుందని తెలుస్తుంది. ‘పెళ్లి చూపులు’ సినిమా తర్వాత  ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా చేసిన తరుణ్ భాస్కర్ సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో మూడో సినిమా చేయబోతున్నాడు.

ఇటివలే తన సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన తరుణ్ భాస్కర్  తన మూడో సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్ లోనే ఉంటుందని కన్ఫర్మ్ చేసాడు. అయితే ఆ సినిమాకు ఇంకా కథ రెడీగా లేదని త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసి ముందుగా రానాకే వినిపిస్తానని తెలిపాడు. రానాకి నచ్చితే  మీ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా అనే ప్రశ్నకు… అంతకంటే అదృష్టమా..అంటూ స్పందించాడు తరుణ్.  సో తరుణ్ స్క్రిప్ట్ గానీ రానా ఓకే చేస్తే ఈ కాంబోలో సినిమా  కన్ఫర్మ్ అయినట్టే.