మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా విజయ్ దేవరకొండ

Thursday,March 19,2020 - 12:29 by Z_CLU

సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మోస్ట్ డిజైరబుల్ టైటిల్ దక్కించుకున్నాడు. “హైదరాబాద్ టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019” లిస్ట్ లో విజయ్ దేవరకొండ కు నెంబర్ వన్ ర్యాంక్ వచ్చింది.


2017లో నెంబర్-2 ప్లేస్ దక్కించుకున్న ఈ రౌడీ స్టార్… 2018 లో నెంబర్ 1 ప్లేస్ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు 2019 లో అదే స్థానం నిలబెట్టుకున్నాడు. 2020 లో కూడా తానే నెంబర్ 1 నిలుస్తానని అంటున్నాడు దేవరకొండ.

విజయ్ యాటిట్యూడ్, డ్రెస్సింగ్స్ మోస్ట్ డిజైరబుల్ లిస్ట్ లో అతడు చేరేలా దోహదపడ్డాయి. ఇక ఫ్యాషన్ విషయానికి వస్తే తన ఆలోచనే తాను వేసుకునే డ్రెస్ సెన్స్ ను డిసైడ్ చేస్తుందని అదే ఫ్యాషన్ అని అంటున్నాడు విజయ్ దేవరకొండ.