జీ సినిమాలు ( 19th జూన్ )

Tuesday,June 18,2019 - 10:07 by Z_CLU

చందమామ

నటీనటులు : నవదీప్కాజల్ అగర్వాల్శివ బాలాజీసింధు మీనన్

ఇతర నటీనటులు : నాగబాబుఉత్తేజ్ఆహుతి ప్రసాద్జీవాఅభినయ శ్రీ

మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : C. కళ్యాణ్, S. విజయానంద్

రిలీజ్ డేట్ : 6 సెప్టెంబర్ 2007

కలర్ ఫుల్ డైరెక్టర్ కృష్ణవంశీ నటించిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చందమామ. నవదీప్శివ బాలాజీలు హీరోలుగా నటించిన ఈ సినిమాలో కాజల్సింధు మీనన్ హీరోయిన్లుగా నటించారు. సినిమాలో భాగంగా అలరించే కామెడీ హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

సుడిగాడు
నటీనటులు : అల్లరి నరేష్మోనాల్ గజ్జర్
ఇతర నటీనటులు : బ్రహ్మానందంఆలీ, M.S. నారాయణరఘుబాబువేణు మాధవ్చంద్ర మోహన్చలపతి రావుధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్
డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు
ప్రొడ్యూసర్ : చంద్రశేఖర్ D రెడ్డి
రిలీజ్ డేట్ : 24 ఆగష్టు 2012
అల్లరి నరేష్ నటించిన స్పూఫ్ కామెడీ చిత్రం సుడిగాడు. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. అల్లరి నరేష్,  బ్రహ్మానందం కాంబినేషన్ లోని కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్.

==============================================================================

తడాఖా
నటీనటులు : నాగచైతన్యసునీల్తమన్నాఆండ్రియా జెరెమియా
ఇతర నటీనటులు : ఆశుతోష్ రానానాగేంద్ర బాబుబ్రహ్మానందంవెన్నెల కిషోర్రఘుబాబురమాప్రభ మరితు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : కిషోర్ కుమార్ పార్ధసాని
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 10th మే 2013
నాగచైతన్యసునీల్ అన్నాదమ్ములుగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తడాఖా. తండ్రి చనిపోగానే వచ్చిన పోలీసాఫీసర్ ఉద్యోగంలో ఇమడలేని అన్నకు తమ్ముడు ఎలాచేదోడు వాదోడుగా నిలిచాడుకథ చివరికి ఏ మలుపు తిరిగిందనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=============================================================================

త్రిపుర

నటీనటులు : స్వాతి రెడ్డినవీన్ చంద్ర
ఇతర నటీనటులు : రావు రమేష్సప్తగిరిశివన్నారాయణ నడిపెద్దిజయ ప్రకాష్ రెడ్డిప్రీతీ నిగమ్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కామ్రాన్
డైరెక్టర్ : రాజ్ కిరణ్
ప్రొడ్యూసర్స్ : A. చినబాబు & రాజశేఖర్
రిలీజ్ డేట్ : 6 నవంబర్ 2015
స్వాతి లీడ్ రోల్ ప్లే చేసిన త్రిపుర పర్ఫెక్ట్ ఇమోషనల్ హారర్ థ్రిల్లర్. పల్లెటూరిలో పెరిగిన త్రిపురకు చిన్నప్పటి నుండి తన చుట్టూ పక్కల జరగబోయే ఇన్సిడెంట్స్ గురించి కలలు వస్తుంటాయి. అవి కాస్తా నిజమవుతుంటాయి. దాంతో త్రిపురకు ట్రీట్ మెంట్ కోసమని సిటీకి తీసుకువస్తారు. అక్కడ నవీన్ చంద్రత్రిపురలు ప్రేమలో పడతారుపెళ్ళి కూడా చేసేసుకుంటారు. ఆ తరవాత ఏం జరుగుతుందనేదే సినిమా ప్రధాన కథాంశం. సస్పెన్స్ ఎలిమెంట్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

చినబాబు
నటీనటులు : కార్తీసాయేషా
ఇతర నటీనటులు : సత్యరాజ్ప్రియా భవానీ శంకర్అర్ధన బినుసూరిభానుప్రియవిజి చంద్రశేఖర్సరోజామౌనిక తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్
డైరెక్టర్ : పాండిరాజ్
ప్రొడ్యూసర్ : సూర్య
రిలీజ్ డేట్ : 13 జూలై 2018
రుద్రరాజు(సత్య రాజ్)ది పెద్ద కుటుంబం. ఇద్దరు భార్యలుఆరుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిల తర్వాత మగ పిల్లాడి కోసం ఎదురుచూస్తున్న వేళ ఆఖరివాడుగా కృష్ణంరాజు(కార్తి) పుడతాడు. అందుకే చినబాబు అవుతాడు. పొలం బాధ్యతలతో పాటు కుటుంబాన్ని కూడా చూసుకుంటాడు చినబాబు. వ్యవసాయం అనేది వృతి కాదు… జీవన విధానం అని నమ్మే చినబాబు పల్లెటూళ్ల నుండి సిటీకెళ్ళిన వాళ్లంతా ఎప్పటికైనా సొంత ఊరిలో రైతులుగా స్థిరపడాలనే లక్ష్యంతో రైతుగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో జాలీ సోడా యజమాని నీల నీరధ(సాయేషా)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు.
కానీ చినబాబు అక్కయ్యలకు వయసుకు వచ్చిన ఇద్దరు కూతుర్లుంటారు. మేనమామగా మరదళ్లను చిన్నతనం నుండి అల్లారుముద్దుగా చూసుకుంటాడు. అయితే తనకు నచ్చిన అమ్మాయిని కాకుండా తమ కూతురునే పెళ్లి చేసుకోవాలని చినబాబుతో గొడవకు దిగుతారు ఇద్దరు అక్కలు.
మరోవైపు కులరాజకీయాలు నడుపుతూ ఊరిలో పెద్దమనిషిగా ఉండే సురేందర్ రాజు(శత్రు)ని ఒక స్టూడెంట్ హత్య కేసులో జైలుకు పంపిస్తాడు చినబాబు. పగబట్టిన సురేందర్ రాజు చినబాబుని చంపే ప్రయత్నాల్లో ఉంటాడు. చినబాబు పెళ్ళి మేటర్ తో కుటుంబంలో కలతలొస్తాయి. మరి చినబాబు తన అక్కయ్యలను ఒప్పించి తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడా… చివరికి సురేందర్ రాజు నుంచి ఎలా తప్పించుకున్నాడు… కుటుంబం మొత్తాన్ని ఎలా కలిపాడనేది మిగతా కథ

==============================================================================

అందాల రాముడు
నటీనటులు : సునీల్ఆర్తి అగర్వాల్
ఇతర నటీనటులు : ఆకాశ్వడివుక్కరసికోట శ్రీనివాస రావుబ్రహ్మానందంధర్మవరపువేణు మాధవ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్
డైరెక్టర్ : P. లక్ష్మి కుమార్
ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్పరాస్ జైన్
రిలీజ్ డేట్ : ఆగష్టు 11, 2006
సునీల్ తన కరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా నటించిన చిత్రం అందాల రాముడు. ఈ సినిమా సునీల్ కరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఆర్తి అగర్వాల్ నటన సినిమాకే హైలెట్.