వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ‘కిల్లర్’

Sunday,January 19,2020 - 09:45 by Z_CLU

డిఫెరెంట్ సినిమాల హీరో విజయ్ ఆంటోని నటించిన ‘కిల్లర్’ వీకెండ్ ఎట్రాక్షన్ గా ఈరోజు ‘జీ తెలుగు’ లో ప్రసారం కానుంది. సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ హీరో అర్జున్ కీ రోల్ ప్లే చేశాడు. అనూహ్యమైన మలుపులతో సాగే ఈ సినిమాను ఈరోజు సాయంత్రం 7 గంటలకు జీ తెలుగు, జీ తెలుగు హెచ్ డీ ఛానెల్స్ లో చూసి ఎంజాయ్ చేయండి.

చెన్నై లో జరిగిన ఒక మర్డర్ నేపథ్యంలో DSP కార్తికేయ (అర్జున్) రంగంలోకి దిగుతాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా చనిపోయిన వ్యక్తి ( వంశీ) రాష్ట్ర మంత్రి తమ్ముడని తెలుస్తుంది. కార్తికేయ ఈ కేసు విషయంలో ఇంకా లోతుకు పరిశీలిస్తే వంశీ, ధరణి అనే అమ్మాయిని ఇబ్బందిపెట్టే వాడనే నిజం తెలుస్తుంది. దాంతో కేసు కొత్త మలుపు తిరుగుతుంది. ఇదే క్రమంలో కార్తికేయ, ప్రభాకర్ (విజయ్ ఆంటోని) గురించి తెలుసుకుంటాడు. గతంలో IPS ఆఫీసర్ గా చేసిన ఈ వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు…? ధరణికి ఈ ప్రభాకరన్ కి ఉన్న సంబంధమేంటి…? అసలీ హత్య ఎవరు చేశారు…? అనేదే ఈ సినిమాలో హై పాయింట్.

విజయ్ ఆంటోని సినిమాలన్నింటిలో కథ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ‘కిల్లర్’ కూడా అంతే. దర్శకుడు ఆండ్రూ లూయిస్ ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మేజర్ హైలెట్.