జీ సినిమాలు ( ఏప్రిల్ 19th)

Tuesday,April 18,2017 - 10:01 by Z_CLU

నటీనటులు : శోభన్ బాబు, రాధికా శరత్ కుమార్, జీవిత

ఇతర నటీనటులు : శరత్ బాబు, గుమ్మడి, M. ప్రభాకర రెడ్డి, ప్రసాద్ బాబు, అన్నపూర్ణ, వై. విజయ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : రవిరాజా పినిశెట్టి

ప్రొడ్యూసర్ : V.S. సుబ్బారావు, K. రవీంద్ర బాబు

శోభన్ బాబు, రాధికా జంటగా నటించిన ఇమోషనల్ ఎంటర్ టైనర్ అన్నా చెల్లెళ్ళు. రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కోర్టు సీన్స్ హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

హీరోహీరోయిన్లు –ఏఎన్నార్,  వాణిశ్రీ

నటీనటులు –గుమ్మడి, కైకాల సత్యనారాయణ, రాజబాబు

సంగీతం –కె.వి.మహదేవన్

దర్శకత్వం –కే.ఎస్. ప్రకాశరావు

విడుదల తేదీ –1971, సెప్టెంబర్ 24

అక్కినేని నాగేశ్వరరావు సినీప్రస్థానంలో ఓ మైలురాయి ప్రేమ్ నగర్. అప్పటికే నవలా నాయకుడిగా స్థిరపడిపోయిన అక్కినేనికి మరింత ఖ్యాతిని తెచ్చిపెట్టింది ఈ సినిమా. కౌసల్యాదేవి రచించిన ఓ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు సినీచరిత్రలో అతిగొప్ప సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. అంతకుముందు కొన్ని సినిమాలతో నష్టాలు చూసిన రామానాయుడు… ఈ సినిమాతో నిర్మాతగా సినీరంగంలో నిలదొక్కుకున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తర్వాత తమిళం, హిందీలో భాషల్లో కూడా రీమేక్ చేశారు.

=============================================================================

నటీ నటులు : నాగార్జున, రీచా గంగోపాధ్యాయ్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి, సోను సూద్, ముకుల్  దేవ్, సాయాజీ షిండే, నాగి నీదు, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, చలపతి రావు,కె.విశ్వనాధ్, ఎం.ఎస్.నారాయణ, రఘు బాబు,వెన్నెల కిషోర్,అజయ్, ఆదిత్య మీనన్,  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : వీర భద్రం చౌదరి

ప్రొడ్యూసర్ : అక్కినేని నాగార్జున

రిలీజ్ డేట్ : 25 అక్టోబర్ 2013

నాగార్జున కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘భాయ్’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మాణం లో దర్శకుడు వీరభద్రం తెరకెక్కిన ఈ చిత్రం లో భాయ్ గా నాగార్జున నటన, యాక్షన్ ఎపిసోడ్, రీచా గంగోపాధ్యాయ్ గ్లామర్,  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్స్. ఈ చిత్రం లో బ్రహ్మానందం, రఘు బాబు, వెన్నెల కిషోర్ కామెడీ అలరిస్తుంది.

==============================================================================

నటీ నటులు : కమల్ కామరాజు, బిందు మాధవి

ఇతర నటీనటులు : రావు రమేష్, వరుణ్ జొన్నాడ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణికాంత్ కద్రి

డైరెక్టర్ : అనీష్ కురువిల్ల

ప్రొడ్యూసర్ : శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల

రిలీజ్ డేట్ : 14 నవంబర్ 2008

శేఖర్ కమ్ముల నిర్మించిన ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ఆవకాయ బిర్యాని. అనిష్ కురువిల్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ కామరాజు, బిందు మాధవి హీరో హీరోయిన్లుగా నటించారు. మనికాంత్ కద్రి సంగీతం ఈ సినిమాకి ఎసెట్.

==============================================================================

నటీనటులు : వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, ఆహుతి ప్రసాద్, రజిత, బ్రహ్మానందం మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ జె. మేయర్

డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 9 అక్టోబర్ 2008

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన కొత్త బంగారు లోకంలో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్ గా నటించారు. రిలీజయిన ప్రతి సెంటర్ లోను అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

=============================================================================

నటీనటులు : గోపీచంద్, మీరా జాస్మిన్

ఇతర నటీనటులు : అంకిత, శివాజీ, ఆశిష్ విద్యార్థి, జయ ప్రకాష్ రెడ్డి, చంద్ర మోహన్

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : ఉదయ శంకర్

ప్రొడ్యూసర్ : GVG రాజు

రిలీజ్ డేట్ : 20 అక్టోబర్ 2006

గోపీచంద్ హీరోగా ఉదయ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కింది రారాజు. అతి సున్నితమైన లవ్ స్టోరి కి  మాస్ ఎలిమెంట్స్ జోడించి ఇంటరెస్టింగ్ గా తెరకెక్కించాడు. ఈ సినిమాలో కలెక్టర్ కావాలని కలలు కనే ఆంబీషియస్ అమ్మాయిగా మీరా జాస్మిన్ సరికొత్తగా కనిపిస్తుంది.  మణిశర్మ మ్యూజికే సినిమాకి హైలెట్.

==============================================================================

హీరోహీరోయిన్లు – కృష్ణుడు, శ్రద్ధ ఆర్య

నటీనటులు – ఏవీఎస్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఎల్బీ శ్రీరాం, ఉత్తేజ్, ఎమ్మెస్ నారాయణ, హేమ, హర్షవర్థన్

సంగీతం – మణిశర్మ

దర్శకత్వం – ఏవీఎస్

విడుదల తేదీ – 2010, జులై 30

రూమ్ మేట్స్, సూపర్ హీరోస్, ఓరి నీ ప్రేమ బంగారంకాను లాంటి సినిమాలతో అప్పటికే దర్శకుడిగా మారిన ఎవీఎస్.. కృష్ణుడితో మరో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. సున్నితమైన హాస్యాన్ని పండిస్తూ తెరకెక్కిన ఆ సినిమానే కోతిమూక. కృష్ణుడు, శ్రద్ధ ఆర్య హీరోహీరోయిన్లు అయినప్పటికీ.. కథ ప్రకారం ఇందులో చాలామంది హీరోలు కనిపిస్తారు. అందరూ కడుపుబ్బా నవ్విస్తారు. ఉత్తేజ్, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం.. ఇలా ఈ హాస్యనటులంతా పండించిన కామెడీనే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. వీటితో పాటు మణిశర్మ అందించిన పాటలు కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి.