ఈ నెలాఖరు వరకు చరణ్ అక్కడే

Wednesday,April 19,2017 - 11:34 by Z_CLU

రామ్ చరణ్, సుకుమార్ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి రాజమండ్రికే ఫిక్స్ అయిపోయాడు చరణ్. మొన్నా మధ్య వీకెండ్ అని చిన్న బ్రేక్ తీసుకున్నా, మళ్లీ హైదరాాబాద్ నుంచి రాజమండ్రికి చేరుకున్నారు. మండే ఎండలు లెక్క చేయకుండా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉన్న యూనిట్, ఈ నెల 28 వరకు షెడ్యూల్ ప్లాన్ చేసింది. అంటే రామ్ చరణ్ ఈ నెలాఖరు వరకు రాజమండ్రి పరిసర ప్రాంతాలకే ఫిక్స్ అన్నమాట.

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో చెర్రీ సరసన సమంతా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చరణ్-సమంత మధ్య ఓ సాంగ్ పిక్చరైజేషన్ పూర్తిచేశారు. ఈ షెడ్యూల్ లోనే మ్యాగ్జిమమ్ షూటింగ్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడు దర్శకుడు సుకుమార్.