యుద్ధం శరణం ఆడియో రిలీజ్ డేట్

Saturday,August 26,2017 - 01:02 by Z_CLU

నాగచైతన్య సినిమా శరవేగంగా ముస్తాబవుతోంది. కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో ఈ హీరో నటించిన చిత్రం యుద్ధ శరణం. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఈమధ్య టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ట్రయిలర్ తో పాటు పాటల విడుదల తేదీని ప్రకటించారు. యుద్ధం శరణం సినిమా ఆడియో సాంగ్స్ తో పాటు ట్రయిలర్ ను రేపు విడుదల చేయబోతున్నారు.

వారాహి చలనచిత్ర బ్యానర్ పై తెరకెక్కింది యుద్ధం శరణం సినిమా. రారండోయ్ వేడుక చూద్దాం లాంటి భారీ హిట్ తర్వాత నాగచైతన్య నుంచి వస్తున్న మూవీ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయంటున్నాడు చైతూ. తాజాగా విడుదలైన టైటిల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ రావడంతో యూనిట్ కాన్ఫిడెన్స్ డబుల్ అయింది.

యుద్ధం శరణం సినిమాలో చైతూ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. వీళ్లిద్దరి కాంబోలో ఇదే మొదటి సినిమా. చైతూ తల్లిదండ్రులుగా రేవతి, రావు రమేష్ నటించారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ విలన్ గా నటించాడు.