క్వీన్ రీమేక్ కు కాల్షీట్లు ఇచ్చిన కాజల్

Saturday,August 26,2017 - 12:03 by Z_CLU

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన క్వీన్ సినిమా సౌత్ లోకి రీమేక్ కానుందనే విషయం తెలిసిందే. తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేసే ప్రయత్నాలు చాన్నాళ్ల కిందటే ప్రారంభయ్యాయి. ఎట్టకేలకు ఈ రీమేక్ లో నటించడానికి కాజల్ అంగీకరించింది. కాల్షీట్లు కూడా కేటాయించింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెలాఖరు నుంచి క్వీన్ తమిళ రీమేక్ పట్టాలపైకి వస్తుంది.

నిజానికి ఈ రీమేక్ లో మొదట తమన్నాను హీరోయిన్ గా అనుకున్నారు. దాదాపు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా ఇవ్వబోయారు. కానీ సడెన్ గా ఈ ప్రాజెక్టు నుంచి తమన్న తప్పుకుంది. ఆమె స్థానంలో తాజాగా కాజల్ ను తీసుకున్నారు. క్వీన్ రీమేక్ లో నటించబోతున్న విషయాన్ని కన్ఫమ్ చేసిన కాజల్.. కాల్షీట్లు కూడా ఇచ్చానని… సౌత్ రీమేక్ కు తమదైన టచ్ ఇస్తానని నమ్మకంగా చెబుతోంది.

క్వీన్ సినిమా ఇప్పటికే సౌత్ లో రీమేక్ అయింది. కన్నడలో బట్టర్ ఫ్లై పేరిట ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు తమిళ్ లోకి ఇది రాబోతోంది. ఒరిజినల్ వెర్షన్ లో కంగనా రనౌన్ నటించింది.