తెలంగాణ మొదటి మెగాస్టార్

Saturday,August 26,2017 - 02:05 by Z_CLU

విజయ్ దేవరకొండను తెలంగాణ మొదటి మెగాస్టార్ అంటున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిన వర్మ… విజయ్ దేవరకొండను ఆకాశానికెత్తేశాడు. కేవలం కళ్లతోనే హీరోయిజం పలికించిన విజయ్ దేవరకొండ కొన్ని దశాబ్దాల పాటు మెగాస్టార్ గా కొనసాగడం ఖాయం అంటున్నాడు వర్మ.

“ఎలాంటి స్లో మోషన్ షాట్స్, ర్యాంపింగ్ షాట్స్ లేకుండా హీరోయిజం చూపించిన హీరోను నేను విజయ్ దేవరకొండను మాత్రమే చూశాను. కేవలం కళ్లతోనే హీరోయిజం చూపించడంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా తనలోనే చూపించాడు. యంగ్ అమితాబ్, యంగ్ ఆల్-పాచినోను కలిపితే విజయ్ దేవరకొండ.” రామ్ గోపాల్ వర్మ స్టేట్ మెంట్ ఇది.

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ రెడ్డి. ఈ సినిమా చూసిన తర్వాత ఈ అభిప్రాయానికొచ్చాడు వర్మ.