యంగ్ హీరోలు @ ఏప్రిల్

Thursday,January 17,2019 - 10:02 by Z_CLU

సమ్మర్ సీజన్ లో బడా హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర క్యూ కట్టడం కామన్…ఈ ఎడాది మాత్రం ఏప్రిల్ నుండే సమ్మర్ హంగామా షురూ చేస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నారు యంగ్ హీరోలు. మహేష్ , ప్రభాస్ ల సినిమాల కంటే ముందే తమ సినిమాలతో థియేటర్స్ లో సందడి చేయడానికి ముగ్గురు యంగ్ హీరోలు రెడీ అవుతున్నారు .

చైతూ,  తేజ్, నాని ఏప్రిల్ లో వారానికొకరు చొప్పున థియేటర్స్ లో కర్చీపులేసేసారు. ఏప్రిల్ 5న నాగ చైతన్య సమంత కలిసి నటిస్తున్న ‘మజిలీ’ ప్రేక్షకుల ముందుకు రానుండగా ఏప్రిల్ 12 న మెగా సుప్రీం హీరో సాయి ధరం తేజ్ ‘చిత్రలహరి’ రిలీజవుతోంది. ఆ వెంటనే ఏప్రిల్ 19న నేచురల్ స్టార్ నాని ‘జెర్సి’ అంటూ క్రికెటర్ గా రాబోతున్నాడు. ఇలా ఏప్రిల్ లో ఈ ముగ్గురు యంగ్ హీరోలు మూడు సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నారు.