‘సైరా’ లో మోస్ట్ ఇంపార్టెంట్ సాంగ్

Thursday,January 17,2019 - 11:03 by Z_CLU

ఈ నెల థర్డ్ వీక్ నుండి సినిమాలోని ఇంపార్టెంట్ సాంగ్ ని చిత్రీకరించనున్నారు మేకర్స్. అయితే ఇది రెగ్యులర్ గా ఉండే సాంగ్స్ లాంటిది కాదు, జాతర బ్యాక్ డ్రాప్ లో ఉండబోయే పాట. అందుకే ప్రస్తుతం రియల్ జాతర సందడికి ఏ మాత్రం తగ్గకుండా అదే తరహా అట్మాస్ఫియర్ ని  క్రియేట్ చేసే ప్రాసెస్ లో ఉంది యూనిట్. ఈ సెట్ కోసం కోట్లలో  ఖర్చు పెడుతున్నారు మేకర్స్.

ఏ మాత్రం హడావిడి లేకుండా ప్రతి షెడ్యూల్ ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటూ, ప్రతి సీక్వెన్సెస్ ని అంతే ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్న ‘సైరా’ టీమ్, ఈ సాంగ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన సినిమా ‘వినయ విధేయ రామ’ ప్రమోషన్ పనులు కూడా చిన్నగా తగ్గిస్తున్న చెర్రీ, ఫుల్ ఫోకస్ ఈ సాంగ్ మేకింగ్ పై పెడుతున్నట్టు తెలుస్తుంది.

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతుందీ సినిమా. అమిత్ త్రివేది ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ లైఫ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.