ఇయర్ ఎండ్ స్పెషల్ : కిరాక్ కామెడీ

Wednesday,December 26,2018 - 05:30 by Z_CLU

కొన్ని సినిమాలకు కామిడీ అనేది చాలా కీలకం.. సినిమా గ్రాఫ్ తగ్గేటప్పుడూ కామెడీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ సినిమా గ్రాఫ్ పెంచుతుంది.. ఏడాది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి థియేటర్స్ లో నవ్వుల పూవులు పూయించిన కిరాక్ కమెడియన్స్ పై ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ.


ఈ ఏడాది ఆరంభంలో థియేటర్స్ కొచ్చిన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు సత్య. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ‘ఛలో’ సక్సెస్ లో సత్య కామెడీ కీ రోల్ పోషించింది. కాలేజిలో చదివే ఓ తమిళ కుర్రాడి క్యారెక్టర్ లో హిలేరియస్ గా నవ్వించాడు. దేవదాస్ సినిమాలో జాకెట్టుగా కూడా ఎంటర్టైన్ చేసాడు.. ఇక ‘అమర్ అక్బర్ అంటోనీ’ సినిమాలో మాత్రం దార్క అనే క్యారెక్టర్ లో కామెడీ విశ్వరూపం చూపించాడు. బాక్సాఫీస్ దగ్గర సినిమా పరాజయమైనా సత్య కామెడీకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.


తన కామెడీతో ఈ ఏడాది హిలేరియస్ గా నవ్వించి బెస్ట్ కమెడియన్ అనిపించుకున్నాడు వెన్నెల కిషోర్.. ‘గీత గోవిందం’లో వెన్నెల కిషోర్ కామెడీ ప్రేక్షకులను విపరీతంగా నవ్వించింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు హైలైట్. ‘చిలసౌ’ సినిమాలో కూడా బాగా నవ్వించాడు కిషోర్. ఈ సినిమాలో ఎదురింటి ఆంటీ దగ్గరికి వెళ్లి అర్దరాత్రి ఆరెంజ్ జ్యూస్ అడిగే కామెడీ బాగా పేలింది. శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో కూడా తన మార్క్ కామెడీతో  ఎంటర్టైన్ చేసాడు.


గతేడాది ‘శతమానం భవతి’ సినిమాలో కంగార్రాజు గా ప్రేక్షకులను విపరీతంగా నవ్వించిన వి.కే నరేష్ ఈ ఏడాది సమ్మోహనం సినిమాతో సర్వేశ్ గా హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసారు. సినిమా అంటే పిచ్చి నటనంటే అమితమైన ప్రేమ కలిగిన ఓ మిడిల్ ఏజ్ మెన్ గా నరేష్ కడుపుబ్బా నవ్వించాడు. ప్రతీ సన్నివేశంలో నటుడవ్వాలనే సర్వేశ్ తాపత్రయం చూసి ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేకపోయారు.


‘అర్జున్ రెడ్డి’ సినిమాతో పాపులర్ అయిన రాహుల్ రామకృష్ణ కూడా ఈ ఇయర్ మంచి కామెడీ పండించి కిరాక్ అనిపించుకున్నాడు. ఈ ఏడాది ‘గీత గోవిందం’ సినిమాలో డైలాగ్ కామెడీతో ఎంటర్టైన్ చేసిన రాహుల్ రామ కృష్ణ ‘హుషారు’ సినిమాలో తన మార్క్ కామెడీతో మెయిన్ హైలైట్ గా నిలిచాడు.  సెకండ్ హాఫ్ లో  రాహుల్ రామకృష్ణ ఎంట్రీ కే థియేటరంతా నవ్వులతో దద్దరిల్లింది.


‘శ్రీనివాస కళ్యాణం’లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ప్రవీణ్ ఆ సినిమాలో తన కామెడీ టైమింగ్ తో బాగానే నవ్వించాడు. ఈ ఏడాదిలోనే రిలీజయిన ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాలో కూడా ప్రవీణ్ కామెడీ హైలైట్ గా నిలిచింది. సినిమాలో బైక్ మెకానిక్ క్యారెక్టర్ లో కనిపిస్తూ అనుపమకి లైన్ వేసే సీన్స్ లో నవ్వులపూవులు పూయించాడు.


‘తొలిప్రేమ’ సినిమాలో భీమవరం రాజుగారు క్యారెక్టర్ లో బాగా నవ్వించాడు హైపర్ ఆది. సెకండ్ హాఫ్ లో లండన్ ఎపిసోడ్స్ లో వచ్చే ఆది కామెడి సినిమాకు హైలైట్ గా నిలిచింది. ‘ఆట గదరా శివ’, ‘సవ్యసాచి’  సినిమాల్లో కూడా ఆది కామెడీ బాగానే పేలింది. ఈ ఇయర్ ‘తొలి ప్రేమ’ ఇచ్చిన బూస్టప్ తో నెక్స్ట్ ఇయర్ ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో తన మార్క్ కామెడితో మళ్ళీ నవ్వించడానికి రెడీ అవుతున్నాడు ఆది.


తన కామెడీ తో ఈ ఏడాది బెస్ట్ కమెడియన్స్ లో ప్లేస్ అందుకున్నాడు అభినవ్ గోమటం. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ముఖ్యంగా హీరో బాగా తాగినప్పుడు అభినవ్ ఎదురుగా కూర్చొనే సన్నివేశానికి ఆడియన్స్ భలే ఎంటర్టైన్ అయ్యారు.

2018  హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఛలో’ లో సుదర్శన్ కామెడీ కూడా ప్రేక్షకులను బాగా అలరించింది. తన మార్క్ స్లాంగ్ తో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో కూడా అదుర్స్ అనిపించుకున్నాడు.

ఈ ఏడాది టాలీవుడ్ కి దొరికిన టాలెంటెడ్ కమెడియన్ విష్ణు. టాక్సీ వాలా సినిమాలో విష్ణు చేసిన కామెడీ సినిమాకే హైలైట్. సెకండ్ హాఫ్ లో వచ్చే మర్చ్యూరీ సీన్ లో విష్ణు కామెడీ హిలేరియస్ గా పేలింది. టాక్సీ వాలా ఇచ్చిన గుర్తింపుతో నెక్స్ట్ సినిమా ఆఫర్ పట్టే ప్లాన్స్ లో ఉన్నాడు విష్ణు.

‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో మిల్క్ మహేష్ కామెడీ కూడా ఈ ఇయర్ కిరాక్ కామెడీ అనిపించుకుంది. ఈ సినిమాలో చిత్తూర్ యాసలో మాట్లాడుతూ కామెడీ టైమింగ్ తో అలరించాడు.

ఈ ఏడాది వైవ హర్ష కూడా కిరాక్ కామెడితో నవ్వించాడు. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ గా వైవ హర్ష కామెడీ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది. సుదీర్ బాబు కి యాక్టింగ్ నేర్పించే సీన్ లో వైవ హర్ష కామెడీ బాగా పేలింది.


‘RX100’ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన కమెడియన్ లక్ష్మణ్ కూడా కామెడితో నవ్వించి సినిమాకు ప్లస్ అయ్యాడు. ముఖ్యంగా పద్యాలతో ఓ కొత్త కామెడీ క్రియేట్ చేసి ఎంటర్టైన్ చేసాడు.

‘అ ఆ’ సినిమాలో తన మార్క్ కామెడీతో నవ్వించిన పమ్మి సాయి ఈ ఏడాది కూడా కిరాక్ కామెడీతో నవ్వించాడు. ఈ ఏడాది రిలీజయిన ‘ఛల్ మోహన రంగ’ సినిమాలో పమ్మి సాయి కామెడీ బాగా పేలింది. ముఖ్యంగా నితిన్ తో కలిసి చేసిన సన్నివేశాల్లో తన మార్క్ కామెడీ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేసాడు.