బ్లఫ్ మాస్టర్ హీరో 'సత్యదేవ్' ఇంటర్వ్యూ

Wednesday,December 26,2018 - 03:35 by Z_CLU

సినిమా సినిమాకి ఎదుగుతూనే ఉన్నాడు హీరో సత్యదేవ్. రీసెంట్ గా ‘అంతరిక్షం’ సినిమాలో డ్యూయల్ రోల్ లో  నటించి ఆడియెన్స్ కి మరింత దగ్గరైన సత్యదేవ్, ఈ సారి ‘బ్లఫ్ మాస్టర్’ గా మరింత మెస్మరైజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. మంచి సినిమాలను ఆడియెన్స్ డెఫ్ఫినెట్ గా ఎంకరేజ్ చేస్తారు అని కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ హీరో, మీడియాతో జరిగిన ఇంటరాక్షన్ లో మరెన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు.

దో నంబర్ ధందా…

పేదవాడు పోగొట్టుకోవడానికి ఏమి ఉండదు. అతిగా డబ్బున్న వాడు కూడా పోగొట్టుకోవడానికి ఏమీ ఉండదు. ఒక మిడిల్ క్లాస్ వాడే ఆశాజీవి. ఒక 10 వేలు ఖర్చు పెడితే 15 రోజుల్లో లక్ష వస్తాయి అనగానే, ఆశగా ఇన్వెస్ట్ చేసేస్తాడు. అతిగా మోసపోయే వాళ్ళు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళే. అలా మోసం చేసే వాళ్ళు ఎక్కడో ఓ చోట ఉంటూనే ఉంటారు. ఎప్పుడో అప్పుడు వస్తూనే ఉంటారు.

అదే బ్లఫ్ మాస్టర్ సినిమా…

సినిమాలో హీరో దో నంబర్ ధందా చేసుకునే ఒక వ్యక్తి. డబ్బుని విపరీతంగా ప్రేమించే ఆ వ్యక్తి జీవితంలోకి, డబ్బు కాదు రిలేషన్ షిప్ ఇంపార్టెంట్ అని నమ్మే ఆ అమ్మాయి ‘అవని’ రావడం, ఇంకోవైపు హీరోలాగే డబ్బుని ఇష్టపడే విలన్ (ఆదిత్య మీనన్), వీరి మధ్య అతని లైఫ్ ఎలా అప్ సైడ్ డౌన్ అయింది అనేదే బ్లఫ్ మాస్టర్ కథ.

ఒక్క గొంగళి పురుగుకే…

ట్రాన్స్ ఫామ్ అవ్వడమన్నది ఒక్క గొంగళి పురుగుకే సాధ్యం. ఒక గొంగళి పురుగు ఎలా బటర్ ఫ్లై లా ట్రాన్స్ ఫామ్ అవుతుందో, అలాగే సినిమాలో హీరో కూడా లాస్ట్ కి ఎలా మారాడు అన్నదే సినిమాలో పాయింట్.

వీళ్ళు చాలా ఇంపార్టెంట్…

సినిమా గురించి మాట్లాడేటప్పుడు గోపీ గణేష్ గారి గురించి తప్పకుండా మాట్లాడాలి. సినిమా తప్ప ఇంకో వ్యాపకం అంటూ లేని వ్యక్తి. ఆయన నన్ను ఈ సినిమాలో తీసుకురావడం కోసం ఎంత తపించారన్నది నాకే తెలుసు. నా గురించి నా కన్నా ఆయన ఎక్కువగా ఆలోచిస్తారు. ఇక నిర్మాత రమేష్ పిళ్ళై గారికి ఇదే స్ట్రేట్ డెబ్యూ. ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడం అన్నది ‘బ్లఫ్ మాస్టర్’ లో ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. సినిమాని ప్రెజెంట్ చేస్తున్న కృష్ణ ప్రసాద్ గారి వల్ల సినిమాకి మరింత బలమొచ్చింది.

అదే నా ఆలోచన…

మంచి నటుడు అనిపించుకోవాలి. లీడ్ రోల్సే చేయాలి అని నేనెప్పుడూ పెట్టుకోలేదు. అందుకే మంచి రోల్ అనిపించిన ప్రతీది చేసుకుంటూనే వచ్చా. కానీ ‘జ్యోతిలక్ష్మి’ నుండి మారిపోయింది. ఆ సినిమా తరవాత ఇంకా మంచి రోల్స్ రావడం బిగిన్ అయ్యాయి. అంతరిక్షం, 47 డేస్, గువ్వ గోరింక, దీంతో పాటు వివేక్ ఆత్రేయ సినిమాలో లీడ్ రోల్స్ చేస్తున్నాను. ఒక హిందీ సినిమా చేస్తున్నా.

నో ఆడిషన్స్…

ఇప్పుడు కొద్దో గొప్పో సినిమాల్లో కనిపిస్తున్నాను కాబట్టి, పెద్దగా ఆడిషన్స్ ఇవ్వాల్సిన అవసరం రావట్లేదు. కానీ ఇవ్వాల్సి వస్తే మాత్రం నాకేం ప్రాబ్లమ్ లేదు.

అదీ డైరెక్టర్ వర్షన్…

గోపీ గణేష్ గారికి బిగినింగ్ నుండి ఈ క్యారెక్టర్ కి నేను పర్ఫెక్ట్ గా సూటవుతాను అని చాలా నమ్మకం. అందుకే ఒకానొక స్టేజ్ లో నేను లేకపోతే ఈ సినిమా చేయను అని అనుకున్నాడు. నాకంత లేదు కానీ, ఆయనకు నాపై ఉన్న నమ్మకమది.

అదే అడుగుదామనుకున్నాం…

మేం ఆడియెన్స్ నుండి కోరుకునేది ఒక్కటే, మీకు సినిమా నచ్చితే మాకోసం, ఈ సినిమా కోసం కష్టపడిన వారందరి కోసం క్లాప్స్ కొట్టండి, ఇదే మేం కోరుకునేది.. సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం.