వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ - అర్జున్ సురవరం

Friday,June 19,2020 - 10:02 by Z_CLU

నిఖిల్ కెరీర్ లోనే మెమొరబుల్ హిట్ గా నిలిచిన సినిమా అర్జున్ సురవరం. ఇప్పుడీ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కాబోతోంది. జీ తెలుగు ఛానెల్ లో ఈ రోజు (జూన్ 21) సాయంత్రం 6 గంటలకు అర్జున్ సురవరం సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

అర్జున్ లెనిన్ సురవరం అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నిఖిల్ ఇందులో మోస్ట్ పవర్ ఫుల్ గా కనిపించాడు. ఫేక్ సర్టిఫికేట్స్ స్కామ్ ను అర్జున్ ఎలా ఛేదించాడనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా బాగుందని మెచ్చుకున్నారంటే “అర్జున్ సురవరం” గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.

థియేటర్లలో రిలీజైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది అర్జున్ సురవరం సినిమా. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి సంతోష్ దర్శకుడు. వెన్నెల కిషోర్, సత్య, విద్యుల్లేఖ కామెడీ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్.

రీసెంట్ టైమ్స్ లో సూపర్ హిట్టయిన ఈ సినిమాను ఈ వీకెండ్ మస్తీగా జీ తెలుగులో చూసి ఎంజాయ్ చేయండి.

అర్జున్ సురవరం.. ఈ రోజు సాయంత్రం.. 6గంటల నుంచి…