మహేష్ సరసన హీరోయిన్ ఫిక్స్

Friday,June 19,2020 - 11:02 by Z_CLU

మొన్నటివరకు పూజా హెగ్డే అన్నారు.
ఆ తర్వాత కియరా అద్వానీ పేరు తెరపైకొచ్చింది.
ఫైనల్ గా కీర్తిసురేష్ పేరు ఫైనల్ అయింది.

హెవీ కాంపిటిషన్ మధ్య మహేష్ కొత్త సినిమా సర్కారు వారి పాటలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది కీర్తిసురేష్. తెలుగులో అజ్ఞాతవాసి తర్వాత కీర్తి దక్కించుకున్న బిగ్ ప్రాజెక్ట్ ఇదే.

మహానటి తర్వాత క్యారెక్టర్ల విషయంలో సెలక్టివ్ గా వెళ్తోంది కీర్తిసురేష్. ఒక విధంగా చెప్పాలంటే రొటీన్ హీరోయిన్ పాత్రలకు దూరమైంది. దీంతో ఇక ఆమె స్టార్ హీరోల సరసన కనిపించే అవకాశం లేదని అంతా అనుకున్నారు.

కానీ సర్కారువారి పాటలో హీరోయిన్ పాత్రకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. యాక్టింగ్ కు మంచి స్కోప్ ఉంది. అందుకే కీర్తిసురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఒకే ఏడాది ఇద్దరు సూపర్ స్టార్స్ తో నటించే గొప్ప అవకాశం కూడా అందుకుంది కీర్తిసురేష్. తమిళ్ లో సూపర్ స్టార్ సరసన అన్నాత్తై సినిమా చేస్తున్న ఈ బ్యూటీ.. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ సరసన సర్కారువారి పాటలో ఛాన్స్ అందుకుంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదలవుతాయి.