సాహో బాహుబలిని క్రాస్ చేస్తుందా?

Tuesday,August 27,2019 - 01:20 by Z_CLU

తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున విడుదలవుతోంది సాహో సినిమా. అంతేకాదు, రికార్డు స్థాయి థియేటర్లు కూడా దక్కాయి. మరోవైపు టిక్కెట్ రేట్లు కూడా పెరిగాయి. వీటికి తోడు భారీ అంచనాలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. సాహో సినిమా బాహుబలి-2 వసూళ్లను అధిగమిస్తుందా అనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ షురూ అయింది.

బాహుబలి-2 వరల్డ్ వైడ్ వసూళ్లను క్రాస్ చేయడం సాధ్యం కాదనుకున్నారంతా. కానీ అమీర్ నటించిన దంగల్ మూవీ, బాహుబలి-2 వరల్డ్ వైడ్ వసూళ్లను క్రాస్ చేసింది. చైనాలో దంగల్ సూపర్ హిట్ అవ్వడంతో నంబర్-1 మూవీగా అవతరించింది. సో.. భారీ స్థాయిలో హిట్ అయితే తప్ప, సాహో సినిమా టాప్-5 రేసులో చేరడం కష్టం.

ప్రపంచవ్యాప్తంగా అత్యథిక వసూళ్లు (గ్రాస్) సాధించిన టాప్-5 సినిమాలేంటో చూద్దాం
దంగల్ – రూ. 2122 కోట్లు
బాహుబలి -2 – రూ. 1788 కోట్లు
పీకే – రూ. 792 కోట్లు
2.O – రూ. 723 కోట్లు
బాహుబలి – రూ. 650 కోట్లు

సాహో  ఈ లిస్ట్ లో ఏ స్థానానికి ఎగబాకుతుందో చూడాలి.