నిజంగా అనుష్కను లవ్ చేస్తే ఎందుకు దాచాలి

Tuesday,August 27,2019 - 03:01 by Z_CLU

అనుష్క, తను ప్రేమించుకుంటున్నామనే రూమర్ పై మరోసారి రియాక్ట్ అయ్యాడు ప్రభాస్. తామిద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని, నిజంగా ప్రేమించుకుంటే ఆ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదని అంటున్నాడు రెబల్ స్టార్. తామిద్దరి మధ్య ఏదో ఉందని జనాలు ఫిక్స్ అయిపోయారని, దాంతో తను కూడా రియాక్ట్ అవ్వడం మానేశానని అంటున్నాడు.

“అనుష్క, నాకు మధ్య ఉన్న రిలేషన్ షిప్ పై ఇక ఏం చెప్పినా జనాలు నమ్మరు. వాళ్లకు వాళ్లు ఫిక్స్ అయిపోయారని అర్థమైంది. ఇక చెప్పడం వేస్ట్. అటు అనుష్కకైనా పెళ్లవ్వాలి, లేదంటే నాకైనా పెళ్లవ్వాలి. అప్పటివరకు ఈ గాసిప్స్ ఆగవు. అనుష్కకు నాకు మధ్య ఏమైనా ఉంటే దాన్ని దాచాల్సిన అవసరం లేదు. రెండేళ్ల పాటు ఎందుకు దాచాలి. ఏం అవసరం. అనుష్క, నేను బెస్ట్ ఫ్రెండ్స్ అంతే.”

నిజానికి ఈ రూమర్ కొన్ని రోజులకు పోతుందని అనుకున్నాడట ప్రభాస్. కానీ రోజులు గడిచేకొద్దీ మరింత స్ట్రాంగ్ గా మారడంతో అప్పుడప్పుడు రియాక్ట్ అయ్యానని, ఇప్పుడు తను వివరణ ఇచ్చిన జనాలు నమ్మే పొజిషన్ లో లేరని చెబుతున్నాడు. అనుష్క తను ఏదైనా బీచ్ లో లేదా దేశంలో కనిపిస్తే రూమర్లు క్రియేట్ చేయొచ్చని, అలాంటిదేం లేకుండా ఎలా పుకార్లు వచ్చాయో అర్థం కావడం లేదంటున్నాడు.

“మేం ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్. పుకార్లు ఉన్నాయని ఫ్రెండ్ షిప్ చెడగొట్టుకోలేం కదా. ఈ పుకార్లపై మేమిద్దరం ఎప్పుడో మాట్లాడుకున్నాం. 3 సినిమాలు కలిసి చేశాం కదా ఈ రూమర్స్ కామన్ అని అప్పుడే ఫిక్స్ అయ్యాం. అందుకే లైట్ తీసుకున్నాం. ఇదంతా జీవితంలో భాగం అనుకోవాలంతే.”

పనిలోపనిగా తన పెళ్లిపై కూడా రియాక్ట్ అయ్యాడు రెబల్ స్టార్. పెళ్లికి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇందులో దాచడానికేం లేదన్నాడు.