టాలీవుడ్ లో మాస్ గెడ్డం గ్యాంగ్

Tuesday,August 27,2019 - 12:02 by Z_CLU

ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు మన హీరోలు. స్టోరీల దగ్గరి నుండి లుక్స్ వరకు ప్రతి సినిమాకి ప్రత్యేకంగా కనిపిస్తుంటారు… ఈ ప్రాసెస్ లో వరసగా హీరోలు గడ్డాలు పెంచేయడంతో టాలీవుడ్ లో గెడ్డం గ్యాంగ్ పెరిగిపోయిందనిపిస్తుంది.

 

వరుణ్ తేజ్ – వాల్మీకి లో ఈ మెగా హీరో లుక్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమేమీ లేదు. వరుణ్ తేజ్ కరియర్ లో ఇంత అగ్రెసివ్ గా ఏ సినిమాలో నటించలేదు. నెగెటివ్ షేడ్స్.. దానికి తోడు ఈ గెడ్డం లుక్స్… జస్ట్ సింప్లీ సూపర్బ్.

చిరంజీవి – ఫ్రీడమ్ ఫైటర్ ‘నరసింహా రెడ్డి’ లా కనిపించబోతున్నాడు మెగాస్టార్ ఈ సినిమాలో. కాస్ట్యూమ్స్ దగ్గర నుండి ప్రతీది ఈ సినిమాలో ప్రత్యేకమే. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి చిరు జుట్టు కూడా ఈ సినిమాలో పొడవే.. దానికి తోడు మాస్ లో క్లాస్ ఫ్లేవర్ ఆడ్ చేస్తున్న గెడ్డం … మరింత గ్రేస్ ఫుల్ గా కనిపిస్తుంది.

విజయ్ దేవరకొండ : రీసెంట్ గా ‘డియర్ కామ్రేడ్’ లో కనిపించాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా రిలీజ్ తరవాత కూడా కొన్ని రోజుల పాటు ఈ లుక్స్ లోనే కనిపించాడు. మామూలుగానే స్టైలిష్ గా ఉంటాడు.. దానికి తోడు ఈ గెడ్డంలో మరింత ఎట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడు విజయ్ దేవరకొండ.

రామ్ పోతినేని – ‘ఇస్మార్ట్ శంకర్’ లో గెడ్డం తో కనిపించాడు. అప్పటి వరకు క్లీన్ షేవ్ తో, పక్కింటబ్బాయిలా కనిపించే రామ్ గెటప్ ని సినిమాకి ముందు కనీసం ఎక్స్ పెక్ట్ కూడా చేయలేదు. రామ్ కరియర్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ స్పెషల్ ప్లేస్ లో ఉంటే.. లుక్స్ మాత్రం ఫరెవర్ ఫ్యాన్స్ కి గుర్తుండిపోతాయి.