పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ సినిమా?

Tuesday,September 17,2019 - 10:02 by Z_CLU

టాలీవుడ్ లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త హాట్ టాపిక్ మారింది. పవర్ స్టార్ నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు కానీ కొంత మంది దర్శకులతో పవన్ సినిమా అంటూ ఫ్యాన్స్ ఊహించేసుకుంటున్నారు. అందులో హరీష్ శంకర్ కూడా ఒకడు. నిజానికి హరీష్ ఈ మధ్యనే పవన్ ని కలిసాడు. ఈ విషయాన్ని హరీష్ స్వయంగా చెప్పడం మీరు గట్టిగా కోరుకోండి కచ్చితంగా జరుగుద్ది అంటూ హింట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఈ కాంబోలో సినిమా పక్కా అని కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు.

లేటెస్ట్ గా మీడియాతో కూడా ఇదే చెప్పాడు హరీష్. అందరూ గట్టిగా కోరుకోండి తథాస్తూ దేవతలు దీవిస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇటివలే పవన్ ను కలిసి సినిమా చేయాల్సిందిగా హరీష్ కోరాడట. సినిమా చేస్తా అని మీరు ఓ మాట చెప్తే కథ సిద్దం చేసేస్తానని అన్నాడట. మరి దీనికి పవన్ ఎలా రియాక్ట్ అయ్యాడో మాత్రం బయటికి రాలేదు. మరి త్వరలోనే ఈ కాంబోలో సినిమా అంటూ ఓ అనౌన్స్ మెంట్ వస్తే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే.