ఎన్టీఆర్- చరణ్ మల్టీ స్టారర్.. అంతా రెడీ

Wednesday,October 31,2018 - 10:01 by Z_CLU

ఎన్టీఆర్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి తెరకెక్కించనున్న మోస్ట్ ఎవైటింగ్ మల్టీ స్టారర్ సెట్స్ పైకి రాబోతుంది. నవంబర్ 5న ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసి 18 నుండి షూటింగ్ మొదలుపెట్టనున్నారని తెలుస్తుంది. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన భారీ సెట్ లో యాక్షన్ ఎపిసోడ్ తో మొదటి షెడ్యుల్ ప్రారంభం కానుందని సమాచారం.

పవర్ పాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారని టాక్. ప్రెజెంట్ లాంచ్ , షూటింగ్ డేట్ గురించి మేకర్స్ నుండి ఎటువంటి అనౌన్స్ మెంట్ లేదు కానీ ఇప్పటికే లాంచ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా లాంచ్ కి సంబంధించి రెండు మూడు రోజుల్లో మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే చాన్స్ ఉంది.