ఇప్పటి వరకు పూరి ఒక్కడే...

Thursday,November 14,2019 - 09:03 by Z_CLU

రవితేజ కరియర్ లో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో హ్యాట్రిక్ కొట్టిన దర్శకుడు పూరి ఒక్కడే. ఇప్పుడు రెండో స్థానంలో గోపీచంద్ మలినేని వస్తాడా..? మాస్ మహారాజ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే అది అసాధ్యం కాదనిపిస్తుంది.

‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ తరవాత ‘ఇడియట్’, ‘అమ్మ నాన్న తమిళ అమ్మాయి..’ మూడు సక్సెస్ లతో హ్యాట్రిక్ కొట్టాడు పూరి జగన్నాథ్. ఇక రవితేజ విషయానికొస్తే ఇవి జస్ట్ సక్సెస్ ఫుల్ సినిమాలు కాదు, బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్స్. బాక్సాఫీస్ దగ్గర రవితేజని మాస్ మహారాజ్ గా నిలిపిన సినిమాలివి.

గోపీచంద్ మలినేని తో ఇప్పటికే 2 సినిమాలు చేశాడు. ఫస్ట్ టైం మెగాఫోన్ పట్టిన ‘డాన్ శీను’, ఆ తర్వాత చేసిన ‘బలుపు’ కూడా బ్లాక్ బస్టర్లే… అందుకే ఇపుడు సెట్స్ పైకి రావడానికి రెడీ అవుతున్న 3 వ సినిమాపై అంచనాలు ఫిక్సవుతున్నాయి.

రవితేజ కరియర్ లో రిపీట్ చేసిన డైరెక్టర్స్ లెక్క గట్టిగానే ఉన్నా, హ్యట్రిక్ కొట్టింది పూరి ఒక్కడే.. చూడాలి మరీ ఈ వరసలో గోపీచంద్ మలినేని కూడా వస్తాడో లేదో..? చూడాలి…