జీ సినిమాలు ( 14th నవంబర్ )

Wednesday,November 13,2019 - 10:03 by Z_CLU

తుంబా

నటీనటులు : దశన్, KPY ధీన, కీర్తి పాండ్యన్

ఇతర నటీనటులు : ధరణి వాసుదేవన్, జార్జ్ విజయ్ నెల్సన్, కళైయారసన్ కన్నుసామి మరియు తదితరులు

మ్యూజిక్ కంపోజర్ అనిరుద్ రవిచందర్, వివేక్ మెర్విన్, సంతోష్ దయానిధి

డైరెక్టర్ హరీష్ రామ్ L.H.

ప్రొడ్యూసర్ : సురేఖ న్యాపతి

రిలీజ్ డేట్ : 21 జూన్ 2019

అనుకోకుండా అడవిలోకి వచ్చి పడిన పులి (తుంబా), దానిబిడ్డ చుట్టూ తిరిగే కథే తుంబా. అలా ప్రమాదవశాత్తు అడివిలోకి వచ్చిన ఈ రెండింటి లెక్క గవర్నమెంట్ రికార్డ్స్ లో ఎలాగూ ఉండదు కాబట్టి వీటిని అమ్ముకుని ఎలాగైనా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉంటాడు అక్కడి ఫారెస్ట్ ఆఫీసర్. ఇదిలా ఉంటే ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఫోటోస్ తీయడానికి పర్మిషన్ తీసుకున్న వర్ష తో పాటు, ఆ అడవికి దగ్గరలో పులి రియల్ స్టాచ్యూ తయారు చేసే పనిలో ఉన్న మరో ముగ్గురు ఈ విషయాన్ని గ్రహించి ఎలాగైనా ఆ పులిని, దానిబిడ్డని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ నుండి కాపాడాలనుకుంటారు. ఇంతకీ తుంబని, దాని బిడ్డని వీళ్ళు కాపాడగలిగారా..? లేదా అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

బావ

నటీనటులు : సిద్ధార్థప్రణీత

ఇతర నటీనటులు రాజేంద్ర ప్రసాద్బ్రహ్మానందంనాజర్సింధు తులాని

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ రామ్ బాబు

ప్రొడ్యూసర్ : పద్మ కుమార్ చౌదరి

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2010

అందమైన పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిందే బావ సినిమాలో సిద్ధార్థప్రణీత హీరోహీరోయిన్లుగా నటించారురాజేంద్ర ప్రసాద్ సిద్ధార్థ తండ్రి సీతారామ్ గా నటించాడునిజానికిఅసలు కథ సీతారామ్ దగ్గరి నుండే మొదలవుతుందిప్రేమించి పెళ్ళి చేసుకున్న తను తన భార్య కుటుంబం నుండి తనను దూరం చేశాననే గిల్ట్ ఫీలిగ్ తో తను చేసిన తప్పు తన కొడుకుచేయకూడదు అనుకుంటూ ఉంటాడుఅంతలో వీరబాబు(సిద్ధార్థఒక అమ్మాయి ప్రేమలోపడతాడు అమ్మాయి తన భార్య అన్న కూతురు అని తెలుసుకున్న సీతారామ్వీరబాబుతోతన ప్రేమను మర్చిపొమ్మంటాడుఅప్పుడు వీరబాబు ఏం చేస్తాడు..? కథ  మలుపుతిరుగుతుందన్న అంశాలు జీ సినిమాలు  లో చూడాల్సిందే.

=============================================================================

పండగ చేస్కో

నటీనటులు : రామ్, రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు : సాయికుమార్, సోనాల్ చౌహాన్, బ్రహ్మానందం, ఆదిత్య మీనన్, రావు రమేష్, పవిత్ర లోకేష్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్

డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ : రవి కిరీటి

రిలీజ్ డేట్ : 29 మే 2015

రామ్, రకుల్ జంటగా నటించిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పండగ చేస్కో. తన కుటుంబ సభ్యుల మధ్య అగాధంలా పేరుకుపోయిన దూరాన్ని హీరో ఎలా తగ్గించాడు..? సమస్యని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే ప్రధాన కథాంశం. ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

=============================================================================

పిల్ల జమీందార్

నటీనటులు : నాని, హరిప్రియ, బిందు మాధవి

ఇతర నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, M.S.నారాయణ, రావు రమేష్, శివ ప్రసాద్, తాగుబోతు రమేష్, ధనరాజ్, వెన్నెల కిశోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సెల్వ గణేష్

డైరెక్టర్ : G. అశోక్

ప్రొడ్యూసర్ : D.S. రావు

రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

న్యాచురల్ స్టార్ నాని తన కరియర్ లో చాలా ఇష్టపడి చేసిన సినిమా పిల్ల జమీందార్. పుట్టుకతో కోటీశ్వరుడైన యువకుడు జీవితం విలువ ఎలా తెలుసుకున్నాడు..? అనే సున్నితమైన కథాంశంతో, పర్ ఫెక్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది పిల్ల జమీందార్. అష్టా చెమ్మా తరవాత నాని, అవసరాల కలిసి చేసిన సినిమా ఇదే.

=============================================================================

ఉన్నది ఒకటే జిందగీ

నటీనటులు : రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి

ఇతర నటీనటులు : శ్రీ విష్ణు, ప్రియదర్శి, కిరీటి దామరాజు, హిమజ, అనీషా ఆంబ్రోస్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : కిషోర్ తిరుమల

ప్రొడ్యూసర్ కృష్ణ చైతన్య, స్రవంతి రవి కిషోర్

రిలీజ్ డేట్ : 27 అక్టోబర్ 2017

అభి(రామ్) – వాసు(శ్రీ విష్ణు) ఒకరిని వదిలి ఒకరు ఉండలేని ప్రాణ స్నేహితులు.  చిన్నతనం నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా  జీవితాన్ని గడుపుతున్న అభి – వాసు జీవితంలోకి  అనుకోకుండా మహా(అనుపమ) అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది.  స్నేహితుడు తర్వాతే ఇంకెవరైనా అనుకునే అభి- వాసులు మహా వల్ల నాలుగేళ్లు  దూరమవుతారు. ఇంతకీ మహా ఎవరు…? ఒకరినొకరు వదిలి ఉండలేని అభి – వాసులు ఎందుకు విడిపోయారు.. చివరికి మళ్ళీ ఎలా కలిశారు..అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

==============================================================================

శివలింగ

నటీనటులు రాఘవ లారెన్స్రితిక సింగ్

ఇతర నటీనటులు : శక్తి వాసుదేవన్రాధా రవివడివేలుసంతాన భారతి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : P. వాసు

ప్రొడ్యూసర్ : R. రవీంద్రన్

రిలీజ్ డేట్ : 14 ఏప్రియల్ 2017

ట్రైన్ లో ప్రయాణిస్తూ హఠాత్తుగా చనిపోయిన రహీం(శక్తి) కేస్ ను ఇంటరాగేషన్ చేయమని పవర్ ఫుల్ సీబీ-సీఐడీ ఆఫీసర్ శివలింగేశ్వర్(లారెన్స్) కు అప్పజెప్తారు కమిషనర్.. అలా కమిషనర్ ఆర్డర్ తో రహీం కేసును టేకప్ చేసిన శివలింగేశ్వర్ తన భార్య సత్యభామ(రితిక సింగ్)తో కలిసి వరంగల్ కి షిఫ్ట్ అవుతాడు. అలా రహీం కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన లింగేశ్వర్ ఆ కేసులో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు..చనిపోయిన రహీం బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఫైనల్ గా శివలింగేశ్వర్ ఏం చేశాడు.. అనేది సినిమా కథాంశం.