'రాజా నరసింహ' వస్తున్నాడు

Thursday,November 14,2019 - 10:02 by Z_CLU

మమ్ముట్టి హీరోగా మలయాళంలో సూపర్ హిట్టైన ‘మధుర రాజా’ సినిమా తెలుగులో ‘రాజా నరసింహ’ టైటిల్ తో డబ్బింగ్ సినిమాగా రిలీజవుతుంది. వైశాక్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదలై అక్కడ గ్రాండ్ హిట్ సాధించింది. గతంలో దర్శకుడు వైశాక్ తెరకెక్కించిన ‘పులి మురుగన్’ సినిమా తెలుగులో ‘మన్యం పులి’ గా విడుదలై సూపర్ హిట్టైంది. ఇప్పుడు అదే కోవలో ఈ సినిమా కూడా మంచి విజయం సాదిస్తుందని భావిస్తున్నారు మేకర్స్.

మమ్ముట్టి పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాలో అను శ్రీ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు , తమిళ హీరో జై ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఈ నెల 22న తెలుగులో గ్రాండ్ గా విడుదలవుతోంది.