దసరాకి వచ్చేది వీళ్ళే..

Saturday,September 10,2016 - 09:00 by Z_CLU

 

002-without-title-1

టాలీవుడ్ లో సంక్రాంతి , విజయదశమి పండుగలకు మంచి డిమాండ్ ఉంది. సెలవు దినాలు పైగా పెద్ద పండగలు కావడంతో వీటిపై కొన్ని నెలల ముందునుంచే కన్నేస్తారు టాలీవుడ్ హీరోలు, ఇలా ఈసారి కొన్ని నెలల ముందే దసరాను బుక్ చేసేసుకున్నారు కొందరు హీరోలు. వీరిలో ముందున్నాడు హీరో రామ్. ఈ పండుగకు తన హైపర్ ఎనర్జీ చూపించాలనుకుంటున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టినరోజే… విజయదశమికి విడుదల అంటూ ప్రకటించేశారు. ‘హైపర్’ తో అందరికంటే ముందుగానే అంటే సెప్టెంబర్ 30 నే థియేటర్స్ లో సందడి చెయ్యబోతున్నారు రామ్.

still-2

 

ఆ వెంటనే ఓ వారం గ్యాప్ అంటే అక్టోబర్ 7న దసరా కానుకగా తన ప్రేమమ్ తో విజయం అందుకోవడానికి వస్తున్నాడు అక్కినేని యువ హీరో నాగచైతన్య. చందు మొండేటి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ మలయాళ రీమేక్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక చైతు తో పాటు అక్టోబర్ 7 నే దసరా కానుకగా హీరో ‘ఇజం’ చూపించడానికి సిద్దమయ్యాడు కళ్యాణ్ రామ్. పూరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ‘యన్.టి.ఆర్ ఆర్ట్స్’ లో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే టీజర్ తో అందరిలోనూ ఆసక్తి రేపుతున్నఈ సినిమా తో గ్రాండ్ హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు కళ్యాణ్ రామ్.

sai_4788_1

 

వీరికి పోటీగా సునీల్ కూడా ఈ దసరాకే ‘ఈడు గోల్డెహే’ సినిమాతో సిద్దమవుతున్నాడు. వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎలాగైనా విజయం అందుకోవాలని భావిస్తున్నాడు. వీరితో పాటు తమన్నా, ప్రభు దేవా, సోను సూద్ ల ‘అభినేత్రి’….. ప్రకాష్ రాజ్ మన ఊరి రామాయణం సినిమాలు కూడా విజయ దశమి కానుకగా విడుదల కానున్నాయి. ఇంకా నెల టైం ఉండడంతో… వీటిలోంచి ఎన్ని డ్రాప్ అవుతాయి.. లేక మరెన్ని యాడ్ అవుతాయనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

dasara-films