ఈసారైనా హిట్ కొడతాడా?

Monday,February 11,2019 - 11:43 by Z_CLU

తండ్రి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఆకాష్ నటించిన మెహబూబా సినిమా ఫ్లాప్ అయింది. మేకింగ్ స్టేజ్ లో భారీ హైప్ వచ్చినప్పటికీ, రిలీజ్ తర్వాత మెహబూబా కిక్ ఇవ్వలేదు. ఆ ఎఫెక్ట్ నుంచి పూర్తిగా కోలుకున్న ఆకాష్ ఇవాళ్టి నుంచి కొత్త సినిమా షూరూ చేశాడు. ఈసారి పూరి జగన్నాధ్ పూర్తిగా తెరవెనక్కే పరిమితమయ్యాడు

పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఆకాష్ పూరి హీరోగా అనీల్ పాడూరి దర్శకత్వంలో కొత్త సినిమా ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి వచ్చింది. ఈ మూవీకి రొమాంటిక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు అనీల్ కేవలం దర్శకుడు మాత్రమే. ఈ సినిమాకు కథ అందించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ పూరి జగన్నాధ్ వే.

మెహబూబా కోసం పునర్జన్మ కాన్సెప్ట్ ను సెలక్ట్ చేసుకున్న ఆకాష్.. రొమాంటిక్ అనే ఈ కొత్త సినిమా కోసం టైటిల్ కు తగ్గట్టు కంప్లీట్ రొమాంటిక్ గా మారాడు. సినిమాకు సంబంధించి హీరోయిన్స్ తో పాటు మిగతా డీటెయిల్స్ ను దశలవారీగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాతోనైనా ఆకాష్ లైమ్ లైట్లోకి రావాలని కోరుకుందాం.