ఘనంగా సౌందర్య రజనీకాంత్ వివాహం

Monday,February 11,2019 - 01:46 by Z_CLU

రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ వివాహం చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈరోజు ఉదయం సౌందర్య-విశాగన్ పెళ్లితో ఒక్కటయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, నటుడు కమల్ హాసన్ తో పాటు పలువురు కోలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు.

3 రోజుల పాటు ఈ వివాహ వేడుక జరిగింది. సంగీత్, మెహందీ ఫంక్షన్లతో పాటు ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ కూడా జరిగింది. చాలామంది రాజకీయ, సినీ ప్రముఖులు ఈ ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ కు ఎటెండ్ అయ్యారు. పెళ్లి మాత్రం సంప్రదాయబద్ధంగా, కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య జరిగింది.

సంగీత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా డాన్స్ చేయడం హైలెట్. తన సినిమాలకు సంబంధించిన సూపర్ హిట్ సాంగ్స్ కు రజనీకాంత్ స్టెప్పువేశారు. ఆ సంగీత్ కు చెందిన క్లిప్పింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతానని ప్రకటించింది సౌందర్య. ఆమెకిది రెండో వివాహం. పారిశ్రామికవేత్త అశ్విన్ తో ఆమె వైవాహిక బంధం సజావుగా సాగలేదు.