చైతూ సరసన బన్నీ బ్యూటీ !

Thursday,February 27,2020 - 12:02 by Z_CLU

‘లవ్ స్టోరి’ సినిమాను ఫినిషింగ్ స్టేజికి తీసుకొచ్చిన నాగ చైతన్య నెక్స్ట్ పరశురాం బుజ్జి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ను ఫైనల్ చేసారని సమాచారం. మొన్నటి వరకూ చైతూ సరసన రష్మిక ను తీసుకోవాలని చూసారు. పరశురాం తెరకెక్కించిన ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ అవ్వడంతో మళ్ళీ రష్మిక నే రిపీట్ చేయాలని అనుకున్నారు.

కానీ రష్మిక బన్నీ సినిమాకు ఎక్కువ కాల్షీట్స్ ఇవ్వడంతో  ఇప్పుడా ప్లేస్ లోకి పూజా వచ్చిందట. ఆల్మోస్ట్  పూజా హెగ్డే ను హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసారనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపి ఆచంట నిర్మిస్తున్నారు.