వీకెండ్ రిలీజెస్

Wednesday,August 14,2019 - 01:29 by Z_CLU

ఆగస్ట్ 15 సందర్భంగా ఈ వారం సినిమాలన్నీ ఒక రోజు ముందే థియేటర్లలోకి వస్తున్నాయి. అంటే గురువారమే సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే.. లాంగ్ వీకెండ్ ఉన్నప్పటికీ ఎందుకో ఎక్కువమంది ఈ డేట్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. సో.. ఈ వీకెండ్ కేవలం 3 సినిమాలే థియేటర్లలోకి వస్తున్నాయి. వాటిలో 2 మాత్రమే కీలకమైనవి.

పంద్రాగస్ట్ కానుకగా గురువారం థియేటర్లలోకి వస్తున్న సినిమా రణరంగం. శర్వానంద్, కాజల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. శర్వానంద్ ఇందులో రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. మాఫియా బ్యాక్ గ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ఆడియన్స్ లో ఓ మోస్తరు అంచనాలున్నాయి.

రణరంగంకు పోటీగా వస్తున్న ఒకే ఒక్క మూవీ ఎవరు. అడవి శేష్, రెజీనా నటించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర ఓ కీలక పాత్ర పోషించాడు. వెంకట్ రామ్ జీ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా ట్రయిలర్ రిలీజ్ చేశారు. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న ఈ ట్రయిలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలు పెంచిన ఎలిమెంట్ ఇదే. పీవీపీ నిర్మించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు.

ఈ రెండు సినిమాలతో పాటు పోలీస్ పటాస్ అనే మరో చిన్న సినిమా ఈ వారం థియేటర్లలోకి వస్తోంది. పోటీ మాత్రం ప్రధానంగా శర్వానంద్, అడవి శేష్ మధ్యే ఉంది.