ఇస్మార్ట్ శంకర్ లేటెస్ట్ కలెక్షన్

Wednesday,August 14,2019 - 12:31 by Z_CLU

రామ్, పూరి జగన్నాధ్ కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ రిలీజై ఇన్నాళ్లయినా ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. మరీ ముఖ్యంగా సి-సెంటర్స్ లో ఈ సినిమా ఇంకా వసూళ్లు సాధిస్తోంది. ఈ మూవీ తర్వాత పదుల సంఖ్యలో సినిమాలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ ఇస్మార్ట్ హవా మాత్రం తగ్గలేదు. రీసెంట్ గా 25 రోజులు పూర్తిచేసుకున్న ఈ మూవీ.. తెలుగు రాష్ట్రాల్లో 34 కోట్ల 27 లక్షల రూపాయల షేర్ రాబట్టింది.

గ్రాస్ పరంగా చూసుకుంటే.. వరల్డ్ వైడ్ ఇప్పటికే 75 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. రామ్ కెరీర్ లోనే కాదు, పూరి కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక టాలీవుడ్ లో ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో రెవెన్యూ పరంగా చూసుకుంటే.. ఎఫ్-2 తర్వాత మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రాఫిటబుల్ వెంచర్ గా పేరుతెచ్చుకుంది ఇస్మార్ట్ శంకర్. ఈ రెండు సినిమాల మధ్యలో వచ్చిన చాలా సినిమాలు హిట్ అయినప్పటికీ… పెట్టిన పెట్టుబడికి, వచ్చిన లాభాలకు కంపేర్ చేసి చూసుకుంటే.. ఎఫ్2 తర్వాత సెకెండ్ ప్లేస్ లో నిలుస్తుంది ఇస్మార్ట్ శంకర్. బయ్యర్లందరికీ డబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది ఈ సినిమా.

ఏపీ, నైజాం 25 రోజుల షేర్
నైజాం – రూ. 15.41 కోట్లు
సీడెడ్ – రూ. 5.72 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.35 కోట్లు
ఈస్ట్ – రూ. 2.02 కోట్లు
వెస్ట్ – రూ. 1.75 కోట్లు
గుంటూరు – రూ. 1.99 కోట్లు
కృష్ణా – రూ. 1.98 కోట్లు
నెల్లూరు – రూ. 1.05 కోట్లు