సైరాకు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్

Wednesday,August 14,2019 - 03:43 by Z_CLU

సైరా సినిమాలో ఇప్పటికే భారీ తారాగణం ఉంది. మెగాస్టార్ తో పాటు అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి క్రేజీ నటులు ఇందులో ఉన్నారు. ఇప్పుడీ ఆకర్షణలకు తోడు మరో మెగా ఎట్రాక్షన్ తోడైంది. అవును.. ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు.

అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. సినిమాలో పవన్ వాయిస్ ఓవర్ ఉంటుందా ఉండగా అనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుతానికైతే టీజర్ లేదా ట్రయిలర్ లో పవర్ స్టార్ గొంతు వినిపించబోతోంది. సినిమాలో ఉందా లేదా అనే విషయాన్ని ప్రచారంలో భాగంగా యూనిట్ బయటపెడుతుంది.

మరోవైపు ఈ సినిమాను ఉత్తరాదిన రిలీజ్ చేసేందుకు ఎక్సెల్ మూవీస్, ఏఏ ఫిలిమ్స్ సంస్థలు ముందుకొచ్చాయి. నార్త్ మొత్తం వీళ్లే రిలీజ్ చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది సైరా నరసింహారెడ్డి మూవీ.