Paagal - లవర్ బాయ్ గా మారిన విశ్వక్

Tuesday,February 02,2021 - 12:04 by Z_CLU

యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా, కాస్త రెబల్ గా కనిపించే విశ్వక్ సేన్.. సడెన్ గా లవర్ బాయ్ గా మారిపోయాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పాగల్. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో గులాబీల మధ్య ఉబర్ కూల్ లవర్ బాయ్ గా కనిపిస్తున్నాడు విశ్వక్.

మ్యూజికల్ ల‌వ్‌స్టోరీగా వస్తున్న ఈ సినిమాను లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నాడు. దిల్ రాజు ప్రజెంట్ చేస్తున్నాడు.

Vishwak Sen Paagal First Look Film To Release On April 30 zeecinemalu

పాగల్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. వీలైనంత తొందరగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి, ఏప్రిల్ 30న మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని కూడా ఈరోజు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

ర‌ధ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు మణికందన్ సినిమాటోగ్రాఫర్.