MukhaChitram Trailer ఇంట్రెస్టింగ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

Thursday,December 01,2022 - 01:06 by Z_CLU

వికాస్ వసిష్ఠ , ప్రియా వడ్లమాని జంటగా సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘ముఖ చిత్రం’ (Mukha Chitram) సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. సుమారు మూడు నిమిషాల ట్రైలర్ తో సినిమా ఎంత ఆసక్తిగా ఉండబోతుందో చూపించారు మేకర్స్. ముఖ్యంగా కలర్ ఫోటో ఫేం సందీప్ రాజ్ ఈ సినిమా కోసం ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ తో పాటు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అందించాడని అర్థమవుతుంది. విజువల్స్ తో పాటు కాల భైరవ అందించిన స్కోర్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది. అలాగే సినిమాలో స్పెషల్ రోల్ చేసిన విశ్వక్ సేన్ (Vishwak Sen) తాలూకు సన్నివేశాలు సినిమాలో ఎలా ఉంటాయో చూపించేలా ట్రైలర్ లో చూపించిన కోర్ట్ రూమ్ సీన్ ఆకట్టుకుంది. విశ్వక్ -రవి శంకర్ మధ్య జరిగే కోర్ట్ రూమ్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తుంది.

ఇద్దరి మధ్య జరిగే ట్రయాంగులర్ లవ్ స్టోరీ తో ఆసక్తికర కథనంతో తెరకెక్కిన ఈ  సినిమాకు గంగాధర్ దర్శకుడు. SKN ప్రెసెంట్స్ లో ప్రదీప్ యాదవ్ , మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ అవ్వబోతుంది. ట్రైలర్ ఎండింగ్ లో రిలీజ్ డేట్ ప్రకటించేశారు మేకర్స్. ఓవరాల్ గా ముఖ చిత్రం ట్రైలర్ సినిమాపై ఆసక్తి నెలకొల్పి బజ్ క్రియేట్ చేస్తుంది.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics