అన్నచెల్లెళ్లుగా విష్ణు, కాజ‌ల్‌!

Tuesday,August 04,2020 - 04:14 by Z_CLU

హీరోహీరోయిన్ల రోల్స్ విష‌యానికి వ‌స్తే, తెర‌పై చ‌క్క‌ని కెమిస్ట్రీ పండించడం ప్ర‌తి న‌టుడూ, ప్ర‌తి న‌టీ తాప‌త్ర‌య‌ప‌డ‌తారు. అదే తోబుట్టువుల పాత్ర‌ల విష‌యానికి వ‌స్తే, అన్నాచెల్లెళ్లుగా లేదా అక్కాత‌మ్ముళ్లుగా కొంత‌మంది యాక్ట‌ర్లు మాత్ర‌మే అద్భుత‌మైన కెమెస్ట్రీ పండించ‌గ‌లుగుతారు.

హాలీవుడ్‌-ఇండియ‌న్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘మోస‌గాళ్లు’ చిత్రంలో ఇద్ద‌రు ప్ర‌తిభావంతులైన యాక్ట‌ర్లు విష్ణు మంచు, కాజ‌ల్ అగ‌ర్వాల్ తోబుట్టువులుగా ఫెంటాస్టిక్ కెమిస్ట్రీ పండిస్తున్నారు. ఇప్ప‌టిదాకా మ‌నం చూడ‌ని ఆన్ స్క్రీన్ బ్ర‌ద‌ర్‌-సిస్ట‌ర్ జంట‌గా వాళ్లు అల‌రించ‌నున్నారు.

‘ర‌క్త సంబంధం’లో ఎన్టీఆర్‌, సావిత్రి అన్నాచెల్లెళ్లుగా, కృష్ణార్జునులులో శోభ‌న్‌బాబు, శ్రీ‌దేవి అన్నాచెల్లెళ్లుగా న‌టించ‌గా, బాలీవుడ్‌లో షారుఖ్ కాన్‌, ఐశ్వ‌ర్యా రాయ్ అన్నాచెల్లెళ్లుగా క‌నిపించారు. ఇప్పుడు ‘మోస‌గాళ్లు’లో విష్ణు, కాజ‌ల్‌ల‌ను తోబుట్టువులుగా చూడ‌బోతున్నాం.

చ‌రిత్ర‌లో న‌మోదైన అతిపెద్ద ఐటీ స్కామ్ నేప‌థ్యంలో త‌యార‌వుతున్న ‘మోస‌గాళ్లు’ మూవీకి సంబంధించి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్ యాక్ట‌ర్ సునీల్ శెట్టి, రుహీ సింగ్‌, న‌వీన్ చంద్ర‌, న‌వ‌దీప్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.