ఇండస్ట్రీ హిట్ కాంబో మళ్ళీ రిపీట్...కానీ!

Tuesday,August 04,2020 - 12:10 by Z_CLU

సూపర్ హిట్ అందుకున్న కాంబినేషన్ లో సినిమా అంటేనే అందరిలో ఓ ఆసక్తి నెలకొంటుంది. మరి అలాంటిది ఇండస్ట్రీ హిట్ కొట్టిన కాంబో లో మళ్ళీ సినిమా అంటే ఆసక్తి అంచనాలుగా మారి అందరి చూపు ఆకట్టుకుంటుంది. అవును.. ఇప్పుడు రామ్ చరణ్, సుకుమార్ కాంబో సినిమాపై ఇలాంటి చర్చే నడుస్తుంది. ‘రంగస్థలం’ సినిమాతో నాన్ ‘బాహుబలి’ రికార్డు కొట్టిన ఈ ఇద్దరూ ఇప్పుడు మళ్ళీ కలుస్తున్నారు.

ఇప్పటికే చరణ్ కోసం రెండు మూడు కథలు అనుకుంటున్నాడు సుక్కు. అందులో చరణ్ ఒక కథ ఎంచుకోవడమే ఆలస్యం..సుక్కు స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టేస్తాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ ‘RRR’ సినిమా చేస్తున్నాడు. దానికి సంబంధించి ఇంకా 30 శాతం షూట్ బ్యాలెన్స్ ఉంది. అది పూర్తయ్యాక మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈలోపు సుకుమార్ బన్నీతో తీస్తున్న ‘పుష్ప’ ను కంప్లీట్ చేసి చరణ్ సినిమాకు కథ సిద్దం చేస్తాడు.

ఇదంతా జరగాలంటే ఏడాది పైనే పట్టొచ్చు. కానీ కాంబోలో సినిమా మాత్రం పక్కా. అందులో సందేహం లేదు. మరి ‘రంగస్థలం’ తర్వాత ఈ కాంబో ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తారో చూడాలి.