ఇద్దరు దర్శకులు.. మధ్యలో పవన్...

Thursday,December 22,2016 - 09:29 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా ‘కాటమరాయుడు’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో పవన్ నెక్స్ట్ ఏ సినిమాను సెట్స్ పై పెట్టబోతున్నాడా? అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవలే తమిళ దర్శకుడు నేసన్ తో ఓ సినిమా… అలాగే త్రివిక్రమ్ తో మరో సినిమాను ప్రారంభించిన పవన్ ఈ సినిమాల్లో ముందుగా దేన్ని సెట్స్ పైకి తీసుకొస్తాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తాజా సమాచారం ప్రకారం ముందుగా తమిళ దర్శకుడు నేసన్ సినిమానే సెట్స్ పై పెట్టబోతున్నాడట పవన్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం తమన్ ట్యూన్స్ కూడా రెడీ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రెజెంట్ కాటమరాయుడు షూటింగ్ తో బిజీగా ఉన్న పవర్ స్టార్ ఈ సినిమా షూట్ ఫినిష్ అవ్వగానే ఓ చిన్న టూర్ ప్లాన్ చేశాడట. ఈ టూర్ నుంచి తిరిగి రాగానే నేసన్ సినిమా స్టార్ట్ చేస్తాడట.