

Tuesday,December 14,2021 - 03:24 by Z_CLU
Vishal’s Laatti Movie Shooting Updates
రెండో షెడ్యూల్ చివరి రోజంతా చిత్రయూనిట్ పని చేసింది. ఇక ఇప్పుడు యూనిట్ అంతా కూడా మూడో షెడ్యూల్ కోసం హైద్రాబాద్‌కు చేరుకుంది. ఇండియన్ టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కించనున్నారు.
‘లాఠీ సినిమాకు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ పూర్తయింది. చివరి రోజున విశ్రాంతి అనేది లేకుండా 24 గంటలు పని చేశామంటే నమ్మకశక్యంగా లేదు.. పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో టీం అంతా కలిసి మూడో షెడ్యూల్ కోసం హైద్రాబాద్‌కు రాబోతోన్నాం’ అని విశాల్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు.
లాఠీ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను ఇది వరకే విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సమాజంలో భారీ మార్పును తీసుకొచ్చే శక్తివంతమైన కథను ఇందులో చూపించబోతోన్నారు. అన్ని భాషల్లోనూ లాఠీ అనే టైటిల్‌తో రిలీజ్ చేయబోతోన్నారు.
ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లో విశాల్ సరసన సునయన హీరోయిన్‌గా నటించనున్నారు. రానా ప్రొడక్షన్స్‌లో రమణ, నందా కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
లాఠీలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతోన్నాయి. ద్వితీయార్థంలో ఉండే 45 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ అవ్వనుంది.
Monday,April 11,2022 01:22 by Z_CLU
Sunday,April 10,2022 10:47 by Z_CLU
Friday,April 01,2022 02:48 by Z_CLU
Tuesday,March 15,2022 12:01 by Z_CLU