Veera Simhaa Reddy - బాలయ్య మూవీ షూటింగ్ అప్ డేట్స్

Friday,October 28,2022 - 01:51 by Z_CLU

బాలకృష్ణ (Balakrishna), గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ వీరసింహారెడ్డి. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ ను ఆవిష్కరించారు. అదే సందర్భంలో సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఆ హంగామా ముగియడంతో, ఇప్పుడీ సినిమా కొత్త షెడ్యూల్ పనిలో పడ్డారు.

ప్రస్తుతం బాలకృష్ణ, విలన్ బ్యాచ్‌ పై భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. కథలో కీలకమైన సమయంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ వస్తందని చెబుతున్నాడు దర్శకుడు. ఫైట్ మాస్టర్ వెంకట్ ఫైట్ సీక్వెన్స్‌ని పర్యవేక్షిస్తున్నాడు.

ఈ చిత్రం కథ యదార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో శృతి హాసన్ (Shruti Hassan) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత సంచలనం థమన్ ఈ చిత్రానికిసంగీతం అందిస్తున్నాడు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. వీరసింహారెడ్డి (Veera Simhaa Reddy) 2023 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.