వెనక్కి తగ్గిన విశాల్ ఒక్కడొచ్చాడు

Friday,November 18,2016 - 11:53 by Z_CLU

పెద్ద నోట్ల రద్దు చిన్న సినిమాలపైనే కాదు పెద్ద సినిమాలపై కూడా భారీ ప్రభావం చూపిస్తుంది. ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని నిన్ననే  రిలీజ్ కావాల్సిన విశాల్ ‘ఒక్కడొచ్చాడు’ సినిమా కూడా వెనకడుగు వేసింది. సినిమా రిలీజ్ ని నెక్స్ట్ మంత్ కి పోస్ట్ పోన్ చేసిన విశాల్, రిలీజ్ లేట్ అయినా సూపర్ హిట్ మాత్రం గ్యారంటీ అంటున్నాడు. పర్ ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో జగపతిబాబు స్పెషల్ క్యారెక్టర్ లో నటించాడు. తమన్న అందాలు ఈ సినిమాకు ఎక్స్ ట్రా బోనస్.