ఇకపై సమంత ప్లేస్ రకుల్ దే...

Friday,November 18,2016 - 01:29 by Z_CLU

కెరీర్ స్టార్టింగ్ లో సమంత ఏ రేంజ్ లో దూసుకెళ్లిందో అందరికీ తెలిసిందే. ఆమె నటించిన ప్రతి సినిమా హిట్ అయింది. బడా బడా ప్రాజెక్టులన్నీ ఆమెకే వచ్చాయి. అలా షార్ట్ స్పాన్ లో హాట్ హీరోయిన్ అయిపోయింది సమంత. కట్ చేస్తే… ప్రస్తుతం టాలీవుడ్ నంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే ప్రస్తుతం సమంత తెలుగు సినిమాలు చేయడం లేదు. నాగచైతన్యతో పెళ్లికి ప్రిపేర్ అవుతుంది. పెళ్లి తర్వాత కచ్చితంగా సినిమాలు తగ్గిస్తుంది.

collage1

అందుకే ఇప్పుడు అంతా రకుల్ ప్రీత్ సింగ్ వైపు చూస్తున్నారు. సమంత స్థానాన్ని భర్తీ చేసే అన్ని లక్షణాలు రకుల్ లో పుష్కలంగా ఉన్నాయి. సేమ్ టు సేమ్ సమంత కెరీర్ లానే రకుల్ కెరీర్ కూడా స్టార్టయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలందరూ రకుల్ వైపే చూస్తున్నారు. మహేష్, రామ్ చరణ్ లాంటి బడా హీరోలతో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ… అతి త్వరలోనే టాలీవుడ్ లో సమంత ప్లేస్ ను ఆక్రమిస్తుందని చాలామంది ఇండస్ట్రీ పెద్దోళ్లు.. తమదైన స్టయిల్ లో ఎనాలసిస్ చేస్తున్నారు.