హ్యాపీ బర్త్ డే

Friday,November 18,2016 - 11:19 by Z_CLU

బంగారం ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది. వెంకీ సరసన బాబు బంగారం సినిమాలో నటించి టాలీవుడ్ బంగారం అనిపించుకున్న ఈ మలయాళీ కుట్టి ఈరోజు తన 34వ ఏట అడుగుపెట్టింది. ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ డిమాండబుల్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న నయన్.. కేరళలో పుట్టిపెరిగింది. మనసినక్కరే అనే మలయాళ సినిమాతో సినీకెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ… రజనీకాంత్ చంద్రముఖి సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ సినిమా తర్వాత మళ్లీ నయనతారకు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకథాటిగా సినిమాలు చేసి టాప్ పొజిషన్ కు చేరుకుంది. 30 దాటిన భామలంతా ఫేడవుట్ అయిపోతున్న ఈరోజుల్లో… 34వ ఏట అడుగుపెట్టిన నయనతార.. ఇంకా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. అంతేకాదు… సినిమాకు 2కోట్ల రూపాయల పారితోషికం కూడా తీసుకుంటోంది. ఈమె కాల్షీట్ల కోసం బడా హీరోలు కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉంది. అందాల సుందరి నయన్ కు జీ-సినిమాలు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది.