ఈ నెలాఖరు నుంచి మరో సీక్వెల్ షురూ

Friday,June 02,2017 - 11:30 by Z_CLU

గతంలో విక్రమ్-హరి కాంబినేషన్ లో వచ్చిన సామి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 2003లో వచ్చిన ఈ సినిమా తెలుగులో లక్ష్మీ నరసింహగా రీమేక్ అయింది. తెలుగులో కూడా ఇది సూపర్ హిట్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అయింది. సామి సినిమాకు అదిరిపోయే సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ చేశాడు దర్శకుడు హరి. దీనికి విక్రమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ నెలాఖరు నుంచి సామి-2 సెట్స్ పైకి రానుంది. సామి సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. సామి-2లో కూడా త్రిషనే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. మరో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను అనుకుంటున్నారు. ప్రస్తుతం విక్రమ్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధృవనక్షత్రం సినిమా చేస్తూనే, మరోవైపు తమన్న హీరోయిన్ గా స్కెచ్ అనే మూవీని ఫైనల్ స్టేజ్ కు తీసుకొచ్చాడు.

స్కెచ్ మూవీ కంప్లీట్ అయిన వెంటనే సామి-2 సెట్స్ పైకి వస్తుంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు.