Liger Release - క్లారిటీ ఇచ్చిన దేవరకొండ

Tuesday,June 22,2021 - 03:22 by Z_CLU

2 రోజులుగా పూరి జగన్నాథ్ -విజయ్ దేవరకొండ ‘లైగర్’ డైరెక్ట్ OTT రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఓ OTT సంస్థ పూరి అండ్ టీంతో డిస్కషన్ చేస్తుందని… అన్ని భాషలకు సంబంధించి 200 కోట్ల వరకూ డిజిటల్ రైట్స్ కి ఆఫర్ ఇచ్చారని సోషల్ మీడియాలో తిరుగుతుంది. అయితే దీన్ని మేకర్స్ తిరస్కరించారని సినిమా ముందుగా థియేటర్స్ లోనే రిలీజ్ ఉంటుందని అంటున్నారు.

అయితే ఈ విషయంపై హీరో విజయ్ స్పందించాడు. ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. “Too Little. I”ll do more in the theaters !” అంటూ లైగర్ తో థియేటర్స్ హంగామా చేస్తానని చెప్పుకున్నాడు. దీంతో సినిమా డైరెక్ట్ OTT రిలీజ్ ఉండదని ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం కరోన సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడిన ‘లైగర్’ త్వరలోనే మళ్ళీ సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యుల్ బ్యాలెన్స్ ఉంది. ఆ షెడ్యుల్ ఫినిష్ చేసి సినిమాను థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ చేస్తారు.

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో స్పోర్ట్స్ బేస్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది. కరణ్ జోహార్ , పూరి, ఛార్మీ నిర్మిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ ట్యూన్స్ ఇస్తున్నాడు. త్వరలోనే అతని పేరు ప్రకటించనున్నారు మేకర్స్. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత పూరి నుండి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రతీ హీరోని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసి ఫ్యాన్స్ ని మెప్పించిన పూరి ఈసారి విజయ్ ని ఎలా చూపిస్తాడోనని రౌడీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics