#NBK107 - లిస్టులో ఆ హీరోయిన్?

Tuesday,June 22,2021 - 03:39 by Z_CLU

నందమూరి బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న #NBK107 సినిమాకు హీరోయిన్ ని ఫిక్స్ చేసే పనిలో బిజీ ఉన్నారు మేకర్స్. మొన్నటి వరకు ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా పలు పేర్లు వినిపించగా ఇప్పుడు మెహ్రీన్ పేరు తెరపైకి వచ్చింది. F2 సినిమాతో స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిన మెహ్రీన్ ప్రస్తుతం F3 లో నటిస్తుంది. ఇటివలే మెహ్రీన్ కి భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తర్వాత మెహ్రీన్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీ విమెన్ గా సెటిలవుతుందని తెలిసిందే.

mehreen new stills zeecinemalu

                     మెహ్రీన్

అందుకే ఈ లోపు అందిన ఆఫర్స్ తో హీరోయిన్ గా బిజీ అవ్వాలని చూస్తోందట. తాజాగా బాలకృష్ణ సినిమా కోసం గోపీచంద్ మలినేని మెహ్రీన్ ను సంప్రదించారని, ఈ క్రేజీ కాంబో సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను ఇటివలే బాలకృష్ణ పుట్టినరోజున అధికారికంగా ప్రకటించారు. జులై చివరి వారం లేదా ఆగస్ట్ నుండి సినిమా షూటింగ్ జరుపుకోనుంది.

mehreen pirzada new stills zeecinemalu

                               మెహ్రీన్

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారనే ప్రచారం ఉంది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. సినిమాలో బాలయ్య కి ఓకె హీరోయిన్ ఉంటుందని ఫ్యామిలీ ఎమోషన్స్ లైట్ గా ఉంటూ క్రాక్ లాగా ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని సమాచారం. ఇక సినిమాలో విలన్ తో పాటు మిగతా పవర్ ఫుల్ క్యారెక్టర్స్ కి నటీ నటులను సెలెక్ట్ చేసే వర్క్ లో బిజీ గా ఉన్నారు టీం. షూటింగ్ మొదలయ్యే సరికల్లా అందరినీ ఫైనల్ చేసి వరుసగా వారి పేర్లు ప్రకటించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics