బైలింగ్వల్ సినిమా ప్లాన్ చేస్తున్న విజయ్

Sunday,October 07,2018 - 10:11 by Z_CLU

వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘నోటా’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. తెలుగులో నెక్స్ట్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో నటించబోతున్న ఈ యంగ్ హీరో తమిళ్, తెలుగులో ఓ బైలింగ్వల్ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు.

ఇటివలే నోటా ప్రమోషన్ లో భాగంగా ఈ విషయాన్నీ చెప్పుకొచ్చాడు విజయ్. తమిళ్ , తెలుగులో ఓ బై లింగ్వల్ ఉందని కానీ నోటా రిలీజ్ తర్వాత ఈ సినిమా విజయాన్ని బట్టే ఆ సినిమా గురించి ఆలోచిస్తానని తెలిపాడు.త్వరలోనే క్రాంతి మాధవ్ సినిమాను సెట్స్ పై పెట్టదానికి రెడీ అవుతున్న  విజయ్ బై లింగ్వల్ సినిమా చేస్తాడా…లేదా తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.